Moviesఓరి దేవుడోయ్.. "దేవర" సినిమా కోసం జాన్వీ అన్ని కోట్లు డిమాండ్...

ఓరి దేవుడోయ్.. “దేవర” సినిమా కోసం జాన్వీ అన్ని కోట్లు డిమాండ్ చేసిందా..? మహా జాదునే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది . ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ తెలుగులో తెరంగేట్రం చేయబోతుంది . అయితే ఈ పాత్ర కోసం కొరటాల శివ బోలెడు మంది హీరోయిన్స్ ని ట్రై చేసి ఫైనల్లీ జాన్వి కపూర్ ని ఈ పాత్రకు బాగా సూట్ అవుతుందని తీసుకున్నారట .

ఈ సినిమా కోసం జాన్వి కపూర్ కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోబోతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఈ సినిమా కోసం అక్షరాల జాన్వి కపూర్ ఐదు కోట్లు ఛార్జ్ చేసిందట . ఇప్పటివరకు జాన్వికపూర్ ఏ సినిమాకి ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయలేదట. అయితే జాన్వికపూర్ అడిగి అడగగానే మేకర్స్ కాదు కూడదు అని లేకుండా అంత పెద్ద అమౌంట్ కి సై అనడం ఇప్పుడు అందరికీ కొత్త డౌట్లు పుట్టిస్తుంది .

స్టార్ హీరోయిన్ సమంత – రష్మిక మందన లాంటి వాళ్ళు కూడా తమ కెరీర్ స్టార్టింగ్ సినిమాలకి రెండు-మూడు కోట్లు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్క హిట్ అంటే ఒక్క హిట్ కొట్టని జాన్వీ కి ఇంత రెమ్యూనరేషన్ ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైన ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎలా ఉందో..నెపోటిజం కూడా అలానే ఉంటాది.. అన్నది మాత్రం వాస్తవం అని ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news