Moviesబిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమో వచ్చేసిందోచ్.. ఆఖరికి నాగర్జున...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమో వచ్చేసిందోచ్.. ఆఖరికి నాగర్జున దగ్గర కూడా అలాంటి పని చేయించారుగా(వీడియో)..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ప్రోమో రానే వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రోమో రీలీజ్ చేసింది స్టార్ మా. కాగ ఇన్నాళ్లు ఈ సీజన్ కి హోస్టుగా ఎవరు చేయబోతున్నారా..? అంటూ బుర్రపీక్కున్నారు . చాలామంది రానా దగ్గుబాటి అని.. విజయ్ దేవరకొండ అని .. బాలకృష్ణ అని రకరకాలుగా పేర్లను ట్రెండ్ చేశారు . ఫైనల్లీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ మళ్లీ నాగార్జుననే చూస్ చేసుకుంది . బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్టుగా నాగార్జునను ప్రకటిస్తూ అఫీషియల్ గా ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా . ఈ క్రమంలోనే కొద్దిసేపట్లోనే స్పీడ్ గా వైరల్ గా మారిపోయింది.

ప్రోమోలో.. ఈసారి సీజన్ 7 సరికొత్తగా ఉండబోతోంది అని చెప్పబోయిన నాగార్జున.. రొటీన్ గా చెప్పేదేగా అంటూ ఆగిపోతారు..అప్పుడే అక్కడ ఉన్న వస్తువలు పైకి లేవడంతో ఈసారి సీజన్ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసినట్టు చెప్పుకొస్తారు. అంతే కాదు ఈసారి కింగ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. గత సీజన్ల అనుభాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి నాగార్జున హోస్టింగ్ స్టైల్ కూడా మార్చేసాదు.. పాత చింతకాయ పచ్చడిలా కాకుండా..లెటేస్ట్ మసాలాలు దట్టించడానికి సిద్ధమవుతున్నాడు.

ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 కు మసాలా గట్టిగా అద్దబోతున్నారు మేకర్స్ అని తెలుస్తుంది. స్టార్ క్రికెటర్ వేణు..కొత్తజంట అమర్దీప్-తేజు.. విడాకులు తీసుకున్న కపుల్ నోయెల్-ఇస్తర్ కూడా ఈ షో లో పాల్గొనబోతున్నారట. అందులో భాగంగా.. కాస్త కాంట్రవర్సీ.. కొంచెం కన్నింగ్.. ఎక్కువగా కామెడీ.. అన్నీ కలగలిపేలా.. కంటెస్టెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారట టీమ్. మొత్తానికి ఈసారి బిగ్ బాస్ హౌస్ రచ్చ రంబోలా గా మారబోతుంది అంటూ చిన్న ప్రోమోతోనే తెలిసిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news