Moviesశ్రీలీల రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక.....

శ్రీలీల రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక.. ఆ సినిమా ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ ఏజ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో పది సినిమాలు పెట్టుకుని మరో ఐదు సినిమాలను హోల్డ్ లో పెట్టుకొని ఇండస్ట్రీలో మకుటం లేని హీరోయిన్ గా రాజ్యమేలేస్తుంది. అందరి హీరోయిన్స్ లా శ్రీలీల కాదు అనుకుంటున్న వాళ్ళకి బిగ్ షాకిచ్చింది ఈ బ్యూటి. ఆమె కూడా తప్పు చేసిందని.. ఓ బంగారం లాంటి సినిమాని మిస్ చేసుకున్నింది అని.. ఇదే విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టాడు నాగశౌర్య .

నాగశౌర్య రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ శ్రీలీల గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన “ఛలో” సినిమాలో మొదటిగా హీరోయిన్గా అనుకునింది శ్రీ లీల నే అంటూ చెప్పుకొచ్చాడు . అయితే ఆమె కొన్ని కారణాల చేత ఈ సినిమా రిజెక్ట్ చేసిందని .. ఆ కారణంగానే రష్మిక మందన్నాను ఈ సినిమాలో చూస్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు.

దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు . బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నావ్ శ్రీలీల అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అక్కడ ఛాన్స్ మిస్ చేసుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మలు ఇద్దరు ఒక్కొక్క సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రాజ్య, ఏలేస్తున్నారు . రష్మిక మందన్న – శ్రీ లీల తమదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ఏలేస్తూ టాప్ హీరోయిన్లుగా ముందుకు దూసుకెళ్తున్నారు. మొత్తానికి తెలుగు సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారాలి అని శ్రీలీల జాతకంలో రాసుందేమో..అందుకే ఇలా జరిగింది అంటూ కౌంటర్ వేస్తున్నారు జనాభా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news