Movies"100కోట్లు ఇచ్చినా..చచ్చినా".. అలాంటి సినిమా చేయను..తేల్చి చెప్పేసిన శ్రీలీల ..!!

“100కోట్లు ఇచ్చినా..చచ్చినా”.. అలాంటి సినిమా చేయను..తేల్చి చెప్పేసిన శ్రీలీల ..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీ లీల హవా ఎంతలా కొనసాగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. శ్రీ లీల ఇప్పటివరకు చేసింది రెండు సినిమాలు. మొదటిది పెళ్లి సందడి.. రెండవది ధమాకా . మొదటి సినిమా యావరేజ్ హిట్టుగా నిలవగా.. రెండో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ప్రెసెంట్ శ్రిలీల చేతిలో ఏకంగా 10 ప్రాజెక్టులు ఉండడం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .

ఒక్క సినిమా హిట్ అయితేనే ఇంతలా స్టార్ హీరోలు ఆమె వెనక పడడానికి కారణమేంటా..? అంటూ చర్చించుకుంటున్నారు . అయితే శ్రీలీల ఎంత అందంగా ఉంటుందో అంత కమిట్మెంట్ గల వ్యక్తి అంటూ డైరెక్టర్స్ మేకర్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు శ్రీ లీలా కమిట్ అయిన పది సినిమాలను కచ్చితంగా ఆరు సినిమాలు హిట్ అయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి .

కాగ రీసెంట్గా శ్రీలీల వద్దకు ఓ స్టార్ డైరెక్టర్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాను తీసుకెళ్లారట . అంతేకాదు 10 కోట్ల పారితోషకాని ఇస్తాం.. ఈ సినిమాలో నటించమంటూ బలవంతం చేశారట . అయితే 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చిన అలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేయను అంటూ తెగేసి చెప్పకు వచ్చిందట శ్రీ లీల . అంతే కాదు సినిమాలో నటించడం అన్నది నాకు ప్యాషన్ ..ఎంజాయ్ గా ఉండాలి కానీ హద్దులు మీరి నా ఫ్యామిలీ పరువును రోడ్డు మీదకి ఇచ్చే విధంగా ఎప్పటికీ చేయను . అలాంటి సినిమాలే చేయాల్సివస్తే సినిమాను ఆపేసి బుద్ధిగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకుంటాను ..నా డాక్టర్ వృత్తిని కొనసాగిస్తాను అంటూ తేల్చి చెప్పేస్తుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news