Moviesబన్నీ, ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న...

బన్నీ, ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ర‌వితేజ‌.. మాస్ హీరో అనిపించాడుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం సర్వసాధారణం . అలా చాలామంది హీరోలకు జరుగుతూనే ఉంటాయి . అలా ఎంతోమంది హీరోలు మిస్ చేసుకుంటేనే .. ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఇంతమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా మారారు. కాగా అదే లిస్టులోకి వస్తారు బన్నీ – ప్రభాస్ . గతంలో ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఇంటి వరకు వచ్చిన సరే బన్నీ – ప్రభాస్ ఆ కథను రిజెక్ట్ చేశారు . దీంతో ఆ కథ రవితేజ వద్దకు వెళ్లి ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ది సూపర్ సక్సెస్ మూవీ గా నిలిచింది.

ఆ సినిమా మరేదో కాదు భద్ర. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది మీరాజాస్మిన్ . ప్రకాష్ రాజ్ – ప్రదీప్ రావత్ – బ్రహ్మాజీ – ఝాన్సీ – మురళీమోహన్ -సునీల్ ఇతరులు ఇందులో కీలకపాత్ర పోషించి సినిమా సక్సెస్ కి కారణం అయ్యారు . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ చాలా హైలెట్గా నిలిచింది .

అయితే బోయపాటి ఈ కథను ముందుగా వివరించింది ప్రభాస్ కి అంటూ తెలుస్తుంది. ఆయన రిజెక్ట్ చేయడంతో బన్నికి వినిపించారట . ఇక ఇద్దరు రిజెక్ట్ చేయడంతో అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రవితేజ చేతిలో ఈ ప్రాజెక్టును పెట్టారు , ఆయన ఒప్పుకోవడం ..సినిమా తెరకెక్కించడం.. సినిమా హిట్ కొట్టడం చకచకా జరిగిపోయాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news