Movies"బుల్లెట్ బండి మీద బాలయ్య ఛేజింగ్"..భగవంత్ కేసరి నుండి క్రేజీ పిక్...

“బుల్లెట్ బండి మీద బాలయ్య ఛేజింగ్”..భగవంత్ కేసరి నుండి క్రేజీ పిక్ లీక్..!!

గ్లోబల్ లైన్ గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ” భగవంత్ కేసరి”. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రీసెంట్ గానే బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు . అభిమానులను తెగ ఆకట్టుకుంది ఈ సినిమా టీజర్.

ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ క్రేజీ అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఉండడంతో.. సినిమా ఇండస్ట్రీలో భగవంత్ కేసరి పేరు మారు మ్రోగి పోతుంది . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఓ పిక్ లీకై సోషల్ మీడియా వైరల్ గా మారింది. బాలయ్య బుల్లెట్ బండి మీద వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో ఈసారి బాలయ్య పర్ఫామెన్స్ మామూలుగా ఉండదని రచ్చ రంబోలానే అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.

ఈ సినిమాలో బాలకృష్ణ బుల్లెట్ బైక్ మీద చేస్ చేసే యాక్షన్ సీన్ అల్టిమేట్ గా ఉంటుందని.. ఇంటర్వెల్ మధ్యలో ఈ సీన్ వస్తుంది అని.. విలన్ అండ్ కో ని వెంటాడుతూ బాలకృష్ణ చేసే ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో జనాలు అరుపులు కేకలతో దద్దరిలేలా మారుమ్రోగిపోయేలా చేస్తారని ..థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం పక్క అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news