Gossipsబాల‌య్య క్రేజీ లైన‌ప్‌లో న‌లుగురు స్టార్ డైరెక్ట‌ర్లు... ఇండ‌స్ట్రీ షేక్‌..!

బాల‌య్య క్రేజీ లైన‌ప్‌లో న‌లుగురు స్టార్ డైరెక్ట‌ర్లు… ఇండ‌స్ట్రీ షేక్‌..!

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా కోసం అందరు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో లుక్స్ మాత్రం అదిరిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు. బాలకృష్ణకి మరో బ్లాక్ బస్టర్ పక్క అంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా, ముఖ్య పాత్రలో శ్రీ లీల నటిస్తుంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కూడా కాకముందే మరో నలుగురు దర్శకులతో సినిమా చేయడానికి బాలకృష్ణ సిద్దమయ్యాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు అనే న్యూస్ అందరికి తెలిసందే. సితార నాగవంశీ – సాయి సౌజన్య నిర్మించే ఈ చిత్రం కూడా యాక్షన్ నేపథ్యంలో సాగే కథ.

ఆ తరువాత హిట్ కాంబినేషన్ అయిన బోయపాటితో బాలకృష్ణ మరో సినిమా చేయనున్నాడు. సింహ, లెజెండ్, అఖండల తరువాత మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానుంది. బాలయ్య అంటే బోయపాటి సినిమా ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాని 14 రీల్స్ నిర్మిస్తుండగా ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఆ తరువాత శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది.

బింబిసార దర్శకుడు వశిష్ట కూడా బాలకృష్ణకి ఒక కథ చెప్పారని, ఆ కథ బాలయ్యకి కూడా నచ్చిందని టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించనున్నారు అనంతరం పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమా అయిన వెంట‌నే బాల‌య్య – బాబి సినిమా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ త‌ర్వాత ఏ సినిమా మొదలు పెడ‌తారో చూడాలి. అయితే ఈ వయసులో కూడా బాలకృష్ణ స్పీడ్ చూసి అందరు షాక్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news