Newsభగవంత్ కేసరి: శ్రీలీల రోల్ మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి...

భగవంత్ కేసరి: శ్రీలీల రోల్ మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి హీరోయిన్ ఎవరో తెలుసా..?

గ్లోబల్ లయన్ గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ . రీసెంట్ గానే బాలయ్య బర్త డే సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్ . కాగా టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ బాలయ్యని అభిమానులు ఎలాంటి లుక్స్ లో చూడాలి అనుకుంటున్నారో అదే విధంగా చూపించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి .

ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా శ్రీ లీల ..ఆయనకు భార్యగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. కాగా నేడు శ్రీ లీల పుట్టినరోజు సందర్భంగా భగవంత్ కేసరి సినిమా నుంచి ఆమె పోస్టుర్ రిలీజ్ చేశారు మేకర్స్. చాలా ట్రెడిషనల్ గా ..చాలా పద్ధతిగా ..చాలా సింపుల్ లుక్ లో ఉన్న అమ్మాయిలా ఉన్న ఈ పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు శ్రీలీల లుక్స్ ఈ సినిమాకి ప్లస్ గా మారనున్నాయి అంటున్నారు అభిమానులు.

ఇలాంటి క్రమంలోనే ఇంత మంచి రోల్ ని మిస్ చేసుకున్న మరో స్టార్ హీరోయిన్ ని ఏకీపారిస్తున్నారు జనాలు, నిజానికి అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఈ పాత్ర కోసం ముందు ఊహించుకున్న హీరోయిన్ కృతి శెట్టి అంటూ తెలుస్తుంది . బాలయ్య కూతురుగా కృతి శెట్టి బాగా సెట్ అవుతుందని భావించారట . అయితే కథ విన్నాక కృతి శెట్టి ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. అందుకే సెక్మడ్ ఆప్షన్ కింద అనిల్..శ్రీలీలను సెలక్ట్ చేసుకున్నాడు. మరో హిట్టు తన ఖాతాలు వేసుకోవడానికి సిద్ధపడింది శ్రీలీల..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news