Moviesవిజయ్ అన్న- రష్మిక వదినా.. సీక్రేట్ మ్యాటర్ని పబ్లిక్ గానే బయటపెట్టేసాడుగా..ఈ...

విజయ్ అన్న- రష్మిక వదినా.. సీక్రేట్ మ్యాటర్ని పబ్లిక్ గానే బయటపెట్టేసాడుగా..ఈ గోల ఏంట్రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇది న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఇండస్ట్రీలో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నల మధ్యలో ఎఫైర్ ఉంది అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . దీనికి తగ్గట్టే వీరు సినిమాలో కూడా రెచ్చిపోయినటించడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అంతేనా తెరపై మాత్రమే కాదు తెర వెనక కూడా ఈ జంట కలిసి మెలిసి తిరుగుతూ ఉండడంతో అభిమానులు కూడా నిజంగానే వీళ్ల మధ్య ప్రేమ ఉంది అని ఫిక్స్ అయిపోయారు. రీసెంట్గా రష్మిక విజయ్ విడిపోయారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

దానికి కారణం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – సమంతనే అంటూ చెప్పుకొచ్చారు జనాలు . ఈ మధ్యకాలంలో రష్మిక మందన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఎక్కువగా కనిపిస్తుంది. విజయ్ కూడా సమంతతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు అన్న కామెంట్లు ఎక్కువగా ఉన్నాయి . దీంతో ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. రీసెంట్గా ఆ వార్తలు ఫేక్ అంటూ చెప్పకనే చెప్పేసింది రష్మిక. విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ సినిమా సాంగ్ రిలీజ్ చేసింది రష్మిక.

ఆనంద్ దేవరకొండ తాజాగా నటిస్తున్న సినిమా బేబీ . వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా లో వీరా జశ్విన్ కీలకమైన పాత్ర పోషించాడు. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది . హైదరాబాద్ పివిఆర్ కి సినీప్లెక్స్ లో స్క్రీన్ వన్ లో జరిగింది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ఈ సాంగ్ రిలీజ్ చేశారు . “ప్రేమిస్తున్నా.. ప్రేమిస్తున్న.. నీ ప్రేమలో జీవిస్తున్న ” అంటూ సాగే ఈ పాట అభిమానుల్ని ఆకట్టుకుంటుంది . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక ఇలాంటి చిన్న హీరో సినిమా సాంగ్ ని రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే ఈవెంట్లో అందరూ రష్మిక మందన మాట్లాడుతున్న టైం లో వదిన వదిన అంటూ కేకలు పెట్టారు . అయితే ఆనంద దేవరకొండ రష్మిక మందన ఆ కామెంట్స్ ని ఏ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు .. నవ్వుతూ చిల్ అవుట్ అవుతూ సరదాగా ఈవెంట్ ని ఫినిష్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య ప్రేమ బ్రేకప్ అవ్వలేదని మధ్యలో బ్రేక్ పడింది అంతే అని ..మళ్ళీ కొనసాగుతుంది అని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news