Moviesఐశ్వ‌ర్య రాజేష్‌ను టార్గెట్ చేసిన ర‌ష్మిక ఫ్యాన్స్‌.. నీ మొఖానికి అంత...

ఐశ్వ‌ర్య రాజేష్‌ను టార్గెట్ చేసిన ర‌ష్మిక ఫ్యాన్స్‌.. నీ మొఖానికి అంత సీన్ లేదంటూ దారుణంగా…!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మ‌రో హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్ పై విమర్శలు చేస్తున్నారు. నీవెంత నీ స్థాయి ఎంత ? అస‌లు నీకు అంత సీన్ ఉందా ? అంటూ మండిప‌డుతున్నారు. అసలు ర‌ష్మిక ఫ్యాన్స్ ఐశ్వ‌ర్య‌ను ఎందుకు ? టార్గెట్ చేస్తున్నారు.. ఏం జ‌రిగిందో చూద్దాం.

తెలుగ‌మ్మాయి అయిన ఐశ్వ‌ర్య రాజేష్ వ‌రుస‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా చేసిన ఫ‌ర్హానా సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ర‌ష్మిక ఫ్యాన్స్‌కు బాగా మంట పెట్టేస్తున్నాయి. ఈ ప్ర‌మోష‌న్లలో ఐశ్వ‌ర్య మాట్లాడుతూ తాను పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రకు తాను బాగా సెట్ అవుతాను అని చెప్పింది.

ఈ మాట‌ల‌ను కార్న‌ర్ చేస్తూ కొంద‌రు పుష్ప సినిమాలో శ్రీవ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక కంటే తాను బాగా చేస్తాను అన్న‌ట్టుగా ప్ర‌చారం చేశారు. దీంతో ర‌ష్మిక అభిమానులు ఐశ్వ‌ర్య‌ను టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయారు. దీంతో ఐశ్వ‌ర్య టీం నుంచి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ వ‌చ్చింది.

తాను ఆ స‌మావేశంలో అసలు ర‌ష్మిక‌ను అవ‌మానించేలా ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని.. పుష్ప సినిమాలో శ్రీవ‌ల్లి పాత్ర త‌న‌కు బాగా సెట్ అవుతుంద‌నే అన్నానే త‌ప్పా.. ర‌ష్మిక కంటే తాను బాగా చేస్తాన‌ని తాను ఎప్పుడూ చెప్ప‌లేద‌ని తెలిపింది. సోష‌ల్ మీడియాలో కాంట్ర‌వ‌ర్సీగా మారిన ఈ వివాదం పెద్ద‌ది కాకుండా ఐశ్వ‌ర్య రాజేష్ టీం నుంచి వెంట‌నే క్లారిటీ రావ‌డంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్ల‌య్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news