Moviesజాక్‌పాట్ ఆఫర్ కొట్టేసిన సుమన్ కూతురు.. స్టార్ హీరో ఇంటికి కోడలు...

జాక్‌పాట్ ఆఫర్ కొట్టేసిన సుమన్ కూతురు.. స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతుందోచ్..!

సుమ‌న్ ఈ పేరు చెపితేనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని ఆనందం. నీచ‌ల్ కుల‌మ్ ( త‌మిళ్‌) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుమ‌న్ 45 ఏళ్లుగా సినిమాల‌తో స‌త్తా చాటుతూనే ఉన్నాడు. 90ల్లో సుమ‌న్ అంటే సౌత్ ఇండియాలోనే తిరుగులేని స్టార్ హీరో. సుమ‌న్‌కు అందంతో పాటు టాలెంట్ ఉన్నా ఇండ‌స్ట్రీలో ఉన్న రాజ‌కీయాల వ‌ల్ల అనుకున్న స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాతులు రాలేదు.

సుమ‌న్ యాక్ష‌న్ సినిమాల‌తో పాటు భ‌క్తిర‌స చిత్రాల్లో న‌టించి కూడా మెప్పించాడు. సుమన్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో త‌న సినిమా జీవితంతో పాటు త‌న జైలు జీవితం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నాడు. నేను జైలుకు ఎందుకు వెళ్లానో అంద‌రికి తెలుసు.. ఆ కేసులో నా ప్ర‌మేయం లేకుండానే న‌న్ను జైలులో పెట్టారు.

ఆ స‌మ‌యంలో సుహాసిని, సుమ‌ల‌త నాకు స‌పోర్ట్ గా మాట్లాడార‌ని సుమ‌న్ గుర్తు చేసుకున్నారు. సుమ‌న్ ఇలాంటి చీప్ ప‌నులు చేయ‌డ‌ని వాళ్లు చేసిన కామెంట్లు నాకు చాలా హెల్ఫ్ అయ్యాయ‌ని కూడా సుమ‌న్ చెప్పాడు. ఇక త‌న కుమార్తె అఖిలజ ప్ర‌త్యూషకు యాక్టింగ్ మీద ఆస‌క్తి లేద‌ని.. రెండేళ్ల క్రిత‌మే ఆమె మ‌ణిపాల్ యూనివర్సిటీలో హ్యూమ‌న్ జెనిటెక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించింద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.

ఇక సౌత్ ఇండియాలో ఓ స్టార్ హీరో ఇంటికి కోడ‌లిగా నా కుమార్తె అడుగు పెడుతున్న‌ట్టు వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని.. ఆమెకు పెళ్లి చేయాల‌న్న ఆలోచ‌న ఉన్నా.. అది ఆమె చ‌దువు పూర్త‌య్యాకే ఆలోచ‌న చేస్తాన‌ని సుమ‌న్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక 1985లో జైలుకు వెళ్లిన సుమ‌న్ జైలు నుంచి వ‌చ్చాక సీనియ‌ర్ దిగ్గ‌జ ర‌చ‌యిత డీవీ న‌ర‌స‌రాజు మ‌న‌వ‌రాలు శిరీష‌ను పెళ్లాడారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news