Moviesవిడాకుల విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నీహారిక..ఉన్నట్టా..? లేన్నట్టా..?

విడాకుల విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నీహారిక..ఉన్నట్టా..? లేన్నట్టా..?

టాలీవుడ్ మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది . దీనిపై ఎన్నిసార్లు నిహారిక ను మీడియా ప్రశ్నించిన సరే ఆమె మౌనం దాలుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ సిరీస్ “డేడ్ పిక్సెల్స్” ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్గా జొన్నలగడ్డ చైతన్యకు సంబంధించిన డివోర్స్ విషయాలపై ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు .

అయితే అన్ని విషయాలకు టపి టపి మని సమాధానం ఇచ్చిన మెగా డాటర్ నిహారిక విడాకులు అన్న మ్యాటర్ పై అస్సలు నోరు విప్పలేదు . అలా అని పాజిటివ్ కామెంట్స్ కూడా చేయలేదు.. అలా అని నెగటివ్ కామెంట్స్ చేయలేదు . ఈ క్రమంలోని నిహారిక విడాకులు కన్ఫామ్ అంటూ మెగా ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు . అంతేకాదు మరి కొంతమంది నిహారిక ఇప్పటికైనా నోరు విప్పి చెపితే సోషల్ మీడియాలో ఆమెపై జరిగే ట్రోలింగ్ కి అడ్డుకట్ట వేయచ్చు అని.. లేకపోతే ఎంతకైనా తెగించి మరి నిహారిక పై వార్తలు ప్రచారం చేస్తారని హెచ్చరిస్తున్నారు .

అయితే నిహారిక మాత్రం విడాకులపై ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో తప్పు అంతా ఆమెదే అని అందుకే మౌనంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే అంతా జరిగిపోయాక దాచిపెట్టి ఇంకేం లాభం ..నిహారిక ఓపెన్ అయితే బాగుంటుంది అంటూ మెగా ఫాన్స్ కూడా ఓపెన్ గా చెబుతున్నారు. మరి ఆ విషయాన్ని మెగా డాటర్ ఓపెన్ గా ఎప్పుడు చెబుతుందో వేచి చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news