Moviesఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ విష‌యంలో పెద్ద గొడ‌వ‌.... దాస‌రి ఇంత పెద్ద...

ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ విష‌యంలో పెద్ద గొడ‌వ‌…. దాస‌రి ఇంత పెద్ద మాయ చేశారా…!

దాస‌రి నారాయ‌ణ‌రావు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగానే కాదు.. మాట‌ల ర‌చ‌యిత‌గా.. పాట‌ల ర‌చ‌యితా.. క‌థ‌కుడిగా.. స్క్రీన్‌ప్లే లోనూ ఆయ‌న‌ది అందెవేసిన చేయి. అలాంటి ద‌ర్శ‌కుడికి ఒక పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. త‌మిళ సినిమాను తెలుగులోకి పూర్తిగా త‌ర్జుమా చేసి తెలుగు వారితోనే సినిమా తీశారు. అదే.. అపూర్వ రాగంగ‌ళం! దీనిని తెలుగులోకి తూర్పు ప‌డ‌మ‌ర పేరుతో డ‌బ్బింగ్ చేశారు. అయితే.. ఎక్క‌డా కూడా మ‌న‌కు త‌మిళ ఫేవ‌ర్ లేకుండా చేశారు.

అయితే.. ఈ సినిమాలో మాట‌లు దాస‌రి రాసుకున్నారు. పాటల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా.. దీనికి నేను పాట‌లు రాయ‌లేను.. అని చెప్పి.. సి. నారాయ‌ణ‌రెడ్డికి, వేటూరికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనిలో ఎవ‌ర్ గ్రీన్ పాట శివ‌రంజ‌ని న‌వ‌రాగిణి అనేది అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికీ భ‌గ్న ప్రేమికులు ఈ పాట‌ను వ‌దిలి పెట్ట‌రు.ఇక‌, ఈ పాట‌ను సి. నారాయ‌ణ‌రెడ్డి రాశారు.

చాలా బాగా రాశారు అని ద‌ర్శ‌కుడు దాస‌రి నుంచి ప్ర‌సంశ‌లు అందుకున్నారు. ఇక‌, నిర్మాత రాఘ‌వ కూడా చాలా సార్లు దీనిని మెచ్చుకున్నారు. అయితే.. పాట చిత్రీక‌ర‌ణ విష‌యానికి వ‌స్తే..మాత్రం ద‌ర్శ‌కుడికి.. నిర్మాత‌గా ఉన్న రాఘ‌వ‌కు మ‌ధ్య వివాదం రేగింది. దీనిని మైసూర్ గార్డెన్ (క‌ర్ణాట‌క‌లో) చిత్రీక‌రించాల‌ని దాస‌రి అనుకున్నారు. అలాగే చేయండి అని చెప్పిన రాఘ‌వ‌.. మ‌ధ్య‌లో రీమిక్స్ కింద స్టెప్పులు ఉండాల‌ని ష‌ర‌తు పెట్టారు.

కానీ, ఈ పాట‌లో స్టెప్పులు ఉండ‌వు. దీనిని హీరో హీరోయిన్‌పై చిత్రీక‌రిస్తాం కానీ.. స్టెప్పులు కుద‌ర‌వు అని చెప్పారు. అయితే.. పాట తీసేయండి అని చెప్పి రాఘ‌వ బెంగ‌ళూరు వెళ్లిపోయారు. దీంతో ఈ పాట లేకుండానే .. సినిమా పూర్త‌యిపోయింది. కానీ, రాఘ‌వ ర‌షెస్ చూసిన త‌ర్వాత‌.. ఏదో వెలితి అనిపించిం ది. అప్పుడు దాస‌రిని క‌ల‌వ‌కుండా.. ఆయ‌న నారాయ‌రెడ్డిని క‌లుసుకుని త‌న బాధ చెప్పుకొన్నారు. దీంతో నారాయ‌ణ‌రెడ్డి.. నారాయ‌ణ చెప్పిన‌ట్టు చేయండి అని స‌ల‌హా ఇచ్చారు. దీంతో చివ‌రి నిముషంలో ఈ పాట‌ను ఎలాంటి స్టెప్పులు లేకుండా తీవ్ర భావోద్వేగంగా (న‌టీన‌టులు) ఈ పాట‌ను చిత్రీక‌రించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news