Moviesర‌ష్మిక‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ పెట్టిన పేరు ఇదే... భ‌లే...

ర‌ష్మిక‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ పెట్టిన పేరు ఇదే… భ‌లే ముద్దుగా ఉందే…!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ – నేష‌న‌ల్ క్ర‌ష్మిక ర‌ష్మిక మంద‌న్న మ‌ధ్య సంథింగ్ సంథింగ్ ఉంద‌న్న ప్ర‌చారం తెలిసిందే. ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా ర‌ష్మిక – విజ‌య్ కాంబినేష‌న్ అంటేనే టాలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబినేష‌న్‌. వీరిద్ద‌రు క‌లిసి ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేస్తుంటే చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు అన్న‌ట్టుగా ఉంటుంది.

ఇక విజ‌య్ త‌మ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇప్ప‌టికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాత్మిక‌తో క‌లిసి చేసిన దొర‌సాని సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు సాయి రాజేష్ దర్శకత్వంలో ‘బేబీ’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా సాంగ్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సంద‌డి చేసింది.

ఇక దేవ‌ర‌కొండ ఫ్యామిలీకి ర‌ష్మిక చాలా క్లోజ్ అన్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఆనంద్ దేవ‌ర‌కొండ సినిమాకు త‌న‌వంతుగా ప్ర‌మోష‌న్ చేసిపెట్టింది. సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో ఆనంద్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ ఉండ‌గా చిన్న దేవ‌ర‌కొండ తోపు అంటూ ఫ్యాన్స్ ఒక్క‌సారిగా నినాదాలు చేశారు. ఇక ఆనంద్ మాట్లాడుతూ అప్పుడే తాను లైఫ్‌లో ఏం పీక‌లేద‌ని… చాలా కాలంగా ర‌ష్మిక‌తో ఉన్న ప‌రిచ‌యం కార‌ణంగా ఆమెను ర‌షి అని పిలుస్తాన‌ని చెప్పాడు.

అంతేకాకుండా ఆమెపై ఆనంద్ దేవరకొండ తన అభిమానం చాటుకున్నాడు. ఇక అన్న ఎక్క‌డ అంటూ ఫ్యాన్స్ గోల చేస్తుంటే వారి గోల చూసిన ర‌ష్మిక ముసిముసి న‌వ్వులు న‌వ్వుకుంది. ఓవ‌రాల్‌గా నేష‌న‌ల్ క్రిష్మ‌క ర‌ష్మిక మంద‌న్నకు మ‌రో ముద్దు పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ర‌షి అంటూ పేరు వింటుంటేనే చాలా క్యూట్‌గా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news