Moviesఎన్టీఆర్ ఓరిజినల్ నేమ్ ఏంటో తెలుసా..? ఆ కారణంగానే స్పాట్ లోనే...

ఎన్టీఆర్ ఓరిజినల్ నేమ్ ఏంటో తెలుసా..? ఆ కారణంగానే స్పాట్ లోనే పేరు మార్చేసారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఎన్నో విషయాలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. కాగా గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. రీసెంట్గా తన 40 వ పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఈ క్రమంలోనే ఆ ఫొటోస్ ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . ఇలాంటి క్రమంలోనే ఆయనకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారడం అభిమానులకు ఆశ్చర్యకరంగా ఉంది . నిజానికి మనం జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నా జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు జూనియర్ ఎన్టీఆర్ కాదు.. ఆయన ఒరిజినల్ నేమ్ “తారక్ రామ్ “. అయితే తారక్ రామ్ గా ఉన్న పేరును జూనియర్ ఎన్టీఆర్ గా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న హరికృష్ణ.. హరికృష్ణ వాళ్ళ నాన్న సీనియర్ ఎన్టీఆర్ గారు. ఒకరోజు సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ ను పిలిపించి “నీ కొడుకుని తీసుకురావయ్యా..” అని అడిగారట . తీరా హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొని సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన “ఏం రా అబ్బాయి నీ పేరేంటి” అని అడిగారట . ఈ క్రమంలోనే మొదట నుండి తాత అంటే భయం గల తారక్..” తారక్ రామ్” అంటూ చెప్పుకొచ్చారట .

అయితే అప్పుడే తారక్ చేయి చూసిన సీనియర్ ఎన్టీఆర్..” భవిష్యత్తులో వీడు నా తర్వాత ..నా అంతటివాడు అవుతాడు .. ఈ అబ్బాయికి ఆ స్టామినా ఉంది.. అందుకే నా పేరు ఈ అబ్బాయికి పెడుతున్నాను . ఇప్పటినుంచి ఈ అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు ” అంటూ హరికృష్ణకు చెప్పుకొచ్చారట. అంతేకాదు ఆ తర్వాత హరికృష్ణ భార్య షాలినీతో కూడా మాట్లాడుతూ..” వీటిని బాగా పెంచు ..రాబోయే కాలానికి కాబోయే పెద్ద హీరో వీడే .. ఏం రా మనవడా ..నా పేరు నిలపెడతావు కదా ..?” ..అంటూ అప్పట్లోనే సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీని ఏలేసే రారాజు జూనియర్ ఎన్టీఆర్ అంటూ చేయి చూసి చెప్పేసారట . అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్కి జాతకాల పిచ్చి ఉండేది అని అందరికీ తెలిసిందే. అలా తారక్ రామ్ గా ఉన్న పేరు నందమూరి తారక రామారావు గా మారిపోయింది. ఆ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ని సింగల్ హ్యాండ్ తో షేక్ చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news