Moviesఎన్టీఆర్ - జ‌య‌ప్ర‌ద‌కు మ‌ధ్య అంత పెద్ద ఇష్యూ న‌డిచిందా.. ఆ...

ఎన్టీఆర్ – జ‌య‌ప్ర‌ద‌కు మ‌ధ్య అంత పెద్ద ఇష్యూ న‌డిచిందా.. ఆ హీరో వ‌ల్లే ఆమెను ప‌క్క‌న పెట్టారా..!

అలనాటి మేటి అందాల తార జయప్రదకు తిరుగులేని ఫాలోయింగ్ ఉండేది. అయితే ఆమెకు రాఘవేంద్రరావు తిరుగులేని స్టార్డం తీసుకువచ్చారు. నటరత్న ఎన్టీఆర్తో జయప్రద నటించిన తొలి సినిమా అడవి రాముడు. 1977లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత అదే ఏడాది ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన చాణక్యచంద్రగుప్త తో పాటు మా ఇద్దరి కథ – యమగోల సినిమాలలోనూ ఎన్టీఆర్‌కు జోడిగా జయప్రద హీరోయిన్గా నటించి అలరించారు.

దీంతో ఎన్టీఆర్ – జయప్రద హిట్ పేరుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మేలుకొలుపు – యుగపురుషుడు – రాజపుత్ర రహస్యం సినిమాలలోను ఆమె ఎన్టీఆర్ తో జోడి కట్టారు. ఆపై ఎన్టీఆర్ డైరెక్షన్ లోనే శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలోను జయప్రద నటించారు. ఆ తర్వాత ఛాలెంజ్ రాముడు – సర్కస్ రాముడు – సూపర్ మాన్ సినిమాలలో కూడా ఈ జోడి ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే మిగిలినవి అన్ని సూపర్ హిట్ అయ్యాయి.

అలాంటి జయప్రద ఆ త‌ర్వాత‌ఎన్టీఆర్ తో క‌లిసి నటించలేదు. ఎన్టీఆర్ తర్వాత మాస్ హీరోగా దూసుకుపోతున్న కృష్ణతో జయప్రద వరుసగా సినిమాలలో నటిస్తున్నారు. కృష్ణ సరసన విజయనిర్మల తర్వాత ఎక్కువ సినిమాలలో హీరోయిన్గా నటించింది జయప్రద. వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 42 సినిమాలు వచ్చాయి. అయితే జయప్రద కృష్ణతో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో కృష్ణతో ఆమెకు మంచి కెమిస్ట్రీ కుదిరింది. జయప్రద కృష్ణ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ను ఏదో ఒక మాట అన్నారు అన్నమాట ఎన్టీఆర్ చెవిలో పడింది.

దీనిని కొందరు పెద్దది చేస్తూ ఎన్టీఆర్ చెంతకు తీసుకువెళ్లారు. దీంతో రామారావు ఆమెను దూరం పెట్టేశారు. ఇదేమీ తెలియని జయప్రద తనకు ఎందుకనో ఎన్టీఆర్ సినిమాలు రావడంలేదని బాధపడేదట. ఆ తర్వాత ఎన్టీఆర్ – శ్రీదేవి జోడీ జనాన్ని ఆకట్టుకోవడంతో జయప్రద గురించి అసలు పట్టించుకోవడం మానేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళటం జయప్రద హిందీ సినిమాలతో బిజీ కావటం జరిగాయి.

అయితే ఎన్టీఆర్‌ను జయప్రద ఎప్పుడు పెద్దాయన అంటూ గౌరవించేవారు. 1994లో జయప్రద ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లారు. ఆ తర్వాత ఆమె యూపీ కి వెళ్లి అక్కడ సమాజవాది పార్టీ తరఫున రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news