Moviesరావణాసుర సినిమా ని చేతుల్లారా వదులుకున్న దురదృష్టవంతుడే ఎవరో తెలుసా.. జుట్టు...

రావణాసుర సినిమా ని చేతుల్లారా వదులుకున్న దురదృష్టవంతుడే ఎవరో తెలుసా.. జుట్టు పీక్కుంటారు..!!

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో.. ఎక్కడ చూసినా రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా పోస్టర్.. సినిమా టాక్ ..పబ్లిక్ రివ్యూ వైరల్ గా మారుతుంది . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన రవితేజ రావణాసుర సినిమా ఫస్ట్ షో కే బ్లాక్ బస్టర్గా నిలిచింది . మరీ ముఖ్యంగా రవితేజ ఈ సినిమాల్లో విజృంభించిన తీరు సినిమాకి హైలెట్ గా మారింది .

డైరెక్టర్ చెప్పిన డైలాగ్స్ తూచా తప్పకుండా అదే విధంగా తనదైన స్టైల్ లో బాడీ మోడ్లేషన్లో చెప్పడం రవితేజ ఫాన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది . ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద రవితేజ రావణాసుర సినిమా హిట్ టాక్ నమోదు చేసుకుంది . అయితే ఈ సినిమాను సుధీర్ వర్మ రవితేజ కంటే ముందే వేరే హీరోతో చేయాలని డిసైడ్ అయ్యారట . ఆ హీరో కి కూడా ఈ సినిమా కథ నచ్చిందట . కానీ కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా రావణాసుర సినిమాను నచ్చిన సరే వదులుకోవాల్సి వచ్చింది అంటూ సదరు ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు.

ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు నేచురల్ స్టార్ హీరో నాని . ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవితేజ రావణాసుర సినిమా కథను అందరికంటే ముందు సుధీర్ వర్మ నానికి వివరించారట . నానికి కూడా ఈ కథ నచ్చిందట. కానీ అప్పటికే దసరా సినిమా షూట్ లో బిజీగా ఉన్న నాని కొన్నాళ్లు టైం అడిగారట . కచ్చితంగా ఈ సినిమా చేస్తాను బట్ కొంచెం టైం కావాలి అని అడిగారట. అయితే నాని చెప్పినంత టైం వెయిట్ చేయలేకపోయినా డైరెక్టర్ ఆ తర్వాత ఈ కథను హీరోలకి వినిపించిన ప్రయోజనం లేకుండా పోవడంతో ఫైనల్ గా రవితేజకు వినిపించి హిట్ కొట్టాడు . ఏ మాటకు ఆ మాట నాని కంటే రవితేజ నే ఈ కధకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది అంటున్నారు రవితేజ ఫాన్స్ . చూడాలి మరి ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో ఈ సినిమా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news