Moviesరావణాసుర పబ్లిక్ టాక్ : సినిమా మొత్తానికి ఊపిరిపోసింది అదే.. ఆ...

రావణాసుర పబ్లిక్ టాక్ : సినిమా మొత్తానికి ఊపిరిపోసింది అదే.. ఆ ఊర నాటు మాస్ డైలాగ్స్ కేవ్వు కేక..అంతే ..!!

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ రీసెంట్ గా నటించిన సినిమా రావణాసుర . సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. చాలాకాలం తర్వాత ధమాకా సినిమాతో రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ పవర్ ను చూపించారు . ఈ క్రమంలోనే ఆ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది .

అంతేనా ఆ తర్వాత నటించిన వాల్తేరు వీరయ్య కూడా సూపర్ డూపర్ హిట్ గా నమోదు చేసుకొని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీంతో ఇప్పుడు రవితేజ నెక్స్ట్ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతే హ్యాట్రిక్ హిట్ నమోదు చేసిన హీరోగా రికార్డ్ నెలకొల్పుతాడు . దాని కోసమే రావణాసుర సినిమాకి రవితేజ చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సెకండ్ సస్పెన్స్ తో క్రియేట్ చేసిన సుధీర్ వర్మ నెగిటివ్ మార్కింగ్ అనేది లేకుండా రావణాసుర సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఫస్ట్ షో తోనే సూపర్ డూపర్ హిట్ కాకుండా నమోదు చేసుకుంది. అంతేకాదు ఇప్పటివరకు మనం చూసిన మాస్ మహారాజా రవితేజను ఒక ఎత్తు అయితే రావణాసుర సినిమాలో చూసే రవితేజ మరో ఎత్తు కచ్చితంగా ఇది రవితేజకు సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఫ్యాన్స్.

మరి ముఖ్యంగా ఈ సినిమాల్లో రవితేజ చెప్పిన మాస్ డైలాగ్ సినిమాకి హైలెట్గా నిలిచాయి . ఇప్పటివరకు తన సినిమాలో మాస్ లాంగ్వేజ్ వరకే యూస్ చేసిన రవితేజ ఏనాడు హద్దులు క్రాస్ చేయలేదు . కానీ ఈ సినిమాలో మాత్రం డైరెక్టర్ ఏది చెప్తే అది ఓపెన్ గా పచ్చిగానే చెప్తూ వచ్చారు . రీసెంట్ గా లీకైన ” కంచం దగ్గరికి మంచం దగ్గరికి ఆడది పిలవగానే రావాలి” అంటూ చెప్పిన బోల్డ్ డైలాగ్ సినిమాలో వచ్చినప్పుడు కుర్రాళ్ళు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతు పేపర్లు ఎగరేస్తూ అరిచి అరిచి గొంతు చించుకుంటున్నారు . ఇలా ఈ విధంగా రవితేజ నటన మాస్ డైలాగ్స్ బిజిఎం అన్ని కూడా సినిమాకి ప్లస్ అని చెప్పాలి . ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రావణాసుర సినిమా సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకునింది. చూడాలి మరి కలెక్షన్స్ ఏ విధంగా రాబడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news