Moviesఆడది మంచానికే పనికొస్తుందా..? స్టార్ హీరో నోట ఊహించని మాట..!!

ఆడది మంచానికే పనికొస్తుందా..? స్టార్ హీరో నోట ఊహించని మాట..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బోల్డ్ మాటలు .. బోల్డ్ సీన్స్.. బోల్డ్ పదాలు ఉంటే.. ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోతుంది. మరి ముఖ్యంగా సినిమాలో బీప్ సౌండ్ పడిందా .. ఆ సినిమా జనాలకు ఎక్కువగా నచ్చేస్తుంది . దీంతో సినిమా ఇండస్ట్రీ ఎటువైపుగా వెళ్తుందో అర్థం కాని పొజిషన్ నెలకొంది . మంచి కంటెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయాల్సిన స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలో బూతు పదాలను వాడుతూ ఆడవాళ్లను కించపరిచే విధంగా డైలాగ్స్ పెట్టుకుంటున్నారు అంటూ మహిళలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్గా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ వైరల్ గా మారింది . సినిమాకి కొద్ది గమటల ముందే సోషల్ మీడియాలో రావణాసుర సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్ లీక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియోలో మాస్ మహారాజ రవితేజ బోల్డ్ డైలాగ్స్ చెప్తూ..” కంచం దగ్గరికి మంచం దగ్గరికి ఆడది పిలవగానే రావాలి ” అంటూ ఊర నాటుగా పచ్చిగా మాట్లాడుతాడు .

ఈ క్రమంలోనే ఈ డైలాగ్ విన్న మహిళా సంఘాలు మండిపడుతున్నారు . ఆడవాళ్ళపై ఇలాంటి డైలాగ్స్ రాయడం ఏంటి ..రాసుకున్న రైటర్ కి .. డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కి .. చెప్పిన హీరోకి బుద్ధి లేదా..? సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు .. అది కూడా రవితేజ లాంటి స్టార్ హీరో ఇలాంటి డైలాగ్స్ ఎంకరేజ్ చేస్తున్నారా..? ఏమన్నా సెన్స్ ఉందా ..? అంటే ఆడది మంచానికి పనికొస్తుందా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . పలువురు సోషల్ మీడియా వేదికగా రవితేజ రావణాసుర సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదా ఈ సినిమాలో ఈ డైలాగ్ ని తీసేసి సినిమాని మళ్లీ రిలీజ్ చేసుకోమని సజెషన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో రవితేజ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.
దీంతో రవితేజ రావణాసుర సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చిన నెగిటివ్ కామెంట్స్ నే వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news