Moviesసుస్మిత అక్క కొంప ముంచేసిన నీహారిక చెల్లి.. సైలెంట్ గా రాడ్...

సుస్మిత అక్క కొంప ముంచేసిన నీహారిక చెల్లి.. సైలెంట్ గా రాడ్ దించేసిందిగా..!

మెగా ఫ్యామిలీ కుమార్తెలు గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నారు. అటు చిరు కుమార్తె సుస్మిత నిర్మాత‌గా మారి ఇప్ప‌టికే సినిమాలు చేస్తోంది. ఇటు సినిమాల‌తో పాటు అటు వెబ్‌సీరిస్‌లు కూడా తీసుకుంటోంది. ఇటీవ‌ల తీసిన చిన్న సినిమా కూడా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అయితే త‌న బ్యాన‌ర్‌కు తిరుగులేని క్రేజ్ తెచ్చేందుకు త‌న తండ్రి హీరోగా ఓ సినిమా చేసేందుకు సుస్మిత ప్ర‌య‌త్నాలు చేయ‌డం.. చిరు కూడా ఓకే చెప్ప‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

అయితే ఇప్పుడు అక్క సుస్మిత‌కు పోటీగా నాగ‌బాబు కూతురు నిహారిక కూడా రంగంలోకి దిగుతోంది. సైలెంట్‌గా అక్క‌కు షాక్ ఇస్తోంది. సుస్మిత‌ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ స్థాపిస్తే, నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యాన‌ర్ స్థాపించింది. ఇక గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ వెన‌క‌ చిరంజీవి కూతురు, అల్లుడు ఉన్నార‌న్న‌ది తెలిసిందే. వీరిద్ద‌రు ముందు అనుభ‌వం కోసం వెబ్‌సీరిస్‌లు చేశారు.

ఆ త‌ర్వాత శ్రీదేవి శోభన్ బాబు అనే చిన్న సినిమా తీశారు. ఈ అనుభ‌వంతోనే ఇప్పుడు మ‌రిన్ని పెద్ద సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మెగా హీరోలు అంద‌రితోనూ త‌న బ్యాన‌ర్లో సినిమాలు చేసుకుంటూ పోవాలని.. ఆ త‌ర్వాత మిడిల్ రేంజ్ హీరోల‌తో సినిమాల‌తో పాటు చిరంజీవి సినిమా కూడా త‌మ బ్యాన‌ర్లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇటు భ‌ర్త‌కు దూర‌మైన‌ట్టు వార్త‌ల్లో ఉంటోన్న నాగ‌బాబు కూతురు నిహారిక కూడా ప్రొడక్షన్ పై అంతే సీరియస్ గా ఉంది.

నిహారిక‌కు ఇప్ప‌టికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ఉంది. ఈమె కూడా షార్ట్ ఫిలిమ్స్ తో పాటు కొన్ని వెబ్‌సీరిస్‌లు చేసింది. పైగా ఆమె హీరోయిన్‌గా కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె త‌న బ్యాన‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకువెళ్లే క్ర‌మంలోనే హైద‌రాబాద్‌లో కాస్ట్‌లీ ఏరియాలో ఓ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసింది. ఇలా ఇద్ద‌రు మెగా డాటర్స్ ప్రొడక్షన్ ఫీల్డ్ లో యాక్టివ్ అయ్యారు. ఈ ఇద్ద‌రూ ఎవ‌రికి వాళ్లు పై చేయి సాధించేందుకు ట్రై చేస్తున్నారు. మ‌రి ఈ అక్కాచెల్లెళ్ల వార్‌లో ఎవ‌రు పై చేయి సాధిస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news