Moviesస్టార్ హీరోయిన్ కావాల్సిన ర‌జ‌నీ ఆ టాప్ డైరెక్ట‌ర్ చేతుల్లో బందీ...

స్టార్ హీరోయిన్ కావాల్సిన ర‌జ‌నీ ఆ టాప్ డైరెక్ట‌ర్ చేతుల్లో బందీ అయిపోయిందా ?

రజ‌ని 1980వ దశకం తర్వాత తెలుగు తెరపై అలా తళుక్కున మెరిసిన హీరోయిన్లలో ఆమె ఒకరు. విజయశాంతి – రజ‌ని – రాధా – శోభన వీళ్లంతా ఒక తరం హీరోయిన్లు. అప్పట్లో రజ‌ని అమాయకపు నటన అంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమెకు ఎలాంటి ?సినీ నేపథ్యం లేదు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ – రజనీ కాంబినేషన్ అంటే ఒక క్రేజ్. అలాగే బాలయ్య తోను ఆమె హిట్ సినిమాలలో నటించారు.

తక్కువ టైంలోనే ఆమెకు హీరోయిన్‌గా మంచి స్థానం దక్కింది. అయితే సినిమా రంగంలో తనకు ఎవరూ లేకపోవడంతో పాటు.. తాను పడిన ఇబ్బందుల నేపథ్యంలో రజ‌ని తన డేట్లు చూసే బాధ్యతను సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావుకు అప్పగించారు. ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎవరిని ఎలా ? నమ్మితే ఏ ఇబ్బందులు వస్తాయో ? అని భావించి రజని ఈ బాధ్యతను గురువుగారు దాసరి మీద పెట్టారు.

అయితే ఇదే ఆమె కెరీర్ కు ఒక విధంగా మైనస్ అయిందని అంటారు. ఏ దర్శక నిర్మాతలు.. హీరోలు అయినా రజనీని తమ సినిమాల్లో హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదట. ముందుగా దాసరిని కలవాలి. దాసరి ఎప్పుడు సినిమాలు షూటింగులతో బిజీగా ఉండేవారు. ఆయనను కలిసేందుకే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. రజ‌ని డేట్ ల కోసమే రోజుల తరబడి దాసరి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది.

అప్పుడు కూడా దాసరికి కథ నచ్చితే లేదా హీరో, దర్శకుడు నచ్చితే ఓకే చెప్పేవారు. లేకపోతే రజని అలా ఖాళీగానే ఉండిపోయేవారు. ఇలా కొన్నేళ్లపాటు రజనీ డేట్లు దాసరి చేతుల్లో బందీ అయిపోయాయి. ఆయ‌న‌ ఎప్పుడూ బిజీగా ఉండటం.. ఆయన చెబితే తప్ప ఎవ్వ‌రికి సినిమా చేయకపోవడంతో ఆమె కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేయలేదని అంటారు. అలా టాలెంట్ ఉండి కూడా ర‌జ‌నీ కెరీర్ స్త‌బ్ధుగా అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news