Moviesపెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే... లిస్ట్ ఇంత...

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే… లిస్ట్ ఇంత పెద్ద‌దా…!

విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న సంప్రదాయాల్లో సహజీవనం కూడా ఒకటి. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల వారు దీనిని పూర్తిగా వ్యతిరేకించినా, ఉన్నత చదువులు అభ్యసించిన వారు, సమాజంలో పలుకుబడి ఉన్న సెలబ్రిటీలు ఈ కల్చర్ ఫాలో అవుతుంటారు. సినీ రంగంలో కూడా సహజీవనం చేసేవారు కొంతమంది ఉన్నారు.

ఇద్దరికీ బేధాభిప్రాయాలు రానంతవరకు కలిసి ఉండి, ఆతర్వాత విడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డేటింగ్ లో ఉన్న అమ్మాయి తల్లి అయితే ఆలోచనలో మార్పు వస్తోంది. బిడ్డ బాగుకోసం పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అలా తల్లిదండ్రులు అయిన తర్వాత భార్య భర్తలు అయిన సెలబ్రిటీలు ఎవ‌రు ఇప్పుడు చూద్దం.

శ్రీదేవి:
అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. భౌతికంగా ఈమె మ‌న మ‌ధ్య లేక‌పోయ‌న‌ ఇప్పటికీ అభిమానులు ఆమెను ఆదరిస్తూనే ఉన్నారు.. ఇంకా మరిచిపోలేకపోతున్నారు. అయితే ఈమె పెళ్లికి ముందే జాన్వీ కపూర్ ను కడుపులో మోసింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. గర్భవతి అయిన తర్వాత బోని కపూర్ ను పెళ్లి చేసుకుంది శ్రీదేవి.

రేణు దేశాయ్:
బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ ఈమెని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత జానీ సినిమాలో కలిసి నటించారు. కానీ అప్పటికే ఇద్దరు ప్రేమలో ఉన్నారు. సహజీవనం కూడా చేశారు. దాంతో పెళ్లికి ముందే పిల్లలకు జన్మనిచ్చింది రేణు దేశాయ్. 2009 ఎన్నికల సమయంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. అయితే మరో బిడ్డ పుట్టిన తర్వాత ఈ జంట 12 ఏళ్ళ బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకున్నారు.

సెలీనా జైట్లీ:
ఈమె పెళ్లికి ముందే గ‌ర్భం దాల్చింది. అంతే కాదు. పెళ్లికి ముందే క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. వారి పేర్లు విన్‌స్ట‌న్‌, విరాజ్‌. త‌ర్వాత పీట‌ర్ హాగ్‌ను వివాహం చేసుకుంది.

సారిక:
తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సారిక 1980ల ప్రారంభంలో కమల్ హాసన్ తో సహజీవనం చేసింది. దీనికి ప్రతిఫలంగా పెళ్లికి ముందే శృతిహాసన్‌కు జన్మనిచ్చింది సారిక. ఆ తర్వాత అక్షర హాసన్ కూడా కమల్ – సారిక దంపతులకు పుట్టింది.

అమృత అరోరా:
పెళ్లికి ముందే ఈమె షకీలా లడక్ తో రిలేషన్ షిప్ లో ఉండి ప్రెగ్నెంట్ కూడా అయింది. ఇక ఈ విషయం ప్రకటించిన కొద్ది రోజులకే పెళ్లి చేసుకుంది.

నీనా గుప్తా:
వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయింది నీనా.. రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు.. కానీ నీనా మాత్రం ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

కొంకణ సేన్ శర్మ:
రణవీర్ షోరే తో చాలాకాలం పాటు డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ, సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే గర్భం దాల్చింది.. కాబట్టి కొన్ని నెలలకు ప్రెగ్నెంట్ అని ప్రకటించింది.

అమీ జాక్సన్:
తన స్నేహితుడు జార్జ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న వెంటనే ఈమె ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

అలియా భట్:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది.

పూర్ణ:
అవును ఫేమ్ పూర్ణ కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చిందట. దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ షానిద్ అసిఫ్ అలీని గత సంవత్సరం అక్టోబర్ నెలలో వివాహం చేసుకుంది పూర్ణ. అయితే పెళ్లయిన ఆరు నెలల్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇలియానా:
ఒకప్పటి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా.. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఈరోజు ఇలియానా తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. దాంతో ఆమె గర్భం దాల్చడానికి కారణం ఎవరు అని నెటిజెన్లు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
ఇక వీరితో పాటు లీసా హెడెన్, గాబ్రియెల్లా దెమెత్రియాడేస్, నేహా ధూపియా, నటాషా స్టాన్ కోవిచ్, కల్కి కొచ్లిన్ కూడా పెళ్ళికి ముందే గర్భం దాల్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news