MoviesStar Hero "ఆడు ఓ నీచ్ కమీన్ కుత్తేగాడు" .. పాన్...

Star Hero “ఆడు ఓ నీచ్ కమీన్ కుత్తేగాడు” .. పాన్ ఇండియా హీరో పై డైరెక్టర్ బూతు కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పాపులారిటీ దక్కించుకొవడానికి పాపులర్ అయిన స్టార్స్ పై ఏదో ఒక కాంట్రవర్షీయల్ కామెంట్ చేసి ఇట్టే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోని అందరూ అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ పలువురు బడా సెలబ్రిటీస్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంటున్నారు. అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా . ఎస్ ప్రెసెంట్ అందరు ఇలానే అంటున్నారు.

ఎందుకంటే రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరో యాష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు . డైరెక్ట్ గా పేరు చెప్పలేదు కానీ సినిమా స్టోరీ ని బయట పెడుతూ క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా కే జి ఎఫ్ సిరీస్ తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..నటించిన హీరో యాష్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయి మాట్లాడారు
.మనకు తెలిసిందే.. కేజీఎఫ్ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో.. 2018 లో విడుదలైన కే జి ఎఫ్ 1 ఎంత హిట్ అయిందో .. అంతకు డబుల్ రేంజ్ లో 2002లో రిలీజ్ అయిన కే జి ఎఫ్ 2 భారీ విజయాన్ని అందుకుంది .

సుమారు 1270 కోట్లకు పైగానే వసూలు రాబట్టి బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది . ఇలాంటి సినిమాపై కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ వేణు మహా రీసెంట్ ఇంట్రవ్యూలో స్పందించారు. సినిమా హీరో డైరెక్టర్ పేరు చెప్పకుండానే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ..”నేను సినిమా పేరు చెప్పదలుచుకోవట్లేదు .. ఈ మధ్యకాలంలో ఆ సినిమా బాగా పాపులారిటీ దక్కించుకుంది.. ఓ మూవీలో తల్లి హీరోని ఒక కోరిక కోరుతుంది ..నువ్వు బాగా బంగారం సంపాదించి చాలా ధనవంతుడు కావాలి అని కోరుకుంటున్నాను అంటుంది ..దీంతో హీరో జనాలతో గనులు తవ్వించి బంగారం బయటకి తీస్తాడు.. లాస్ట్ లో అలా ఇలా మాటలు చెప్పి బంగారం తీసుకెళ్ళిపోతాడు ..అసలు వాడు హీరోనా.. వాడు నీచ్ కమీన్ కుత్తే.. వాడి చుట్టూ కొన్ని వేల మంది ఉంటారు ..అయినా కానీ వాడు ఇలాంటి పనిచేస్తాడు ..వాళ్ళందరినీ వదిలేసి ..ఆ బంగారాన్ని ఓ చోట పారదొబ్బుతాడు .. అసలు వాడిని ఎవరైనా హీరో అంటాడా..? నిజమైన హీరో ఇలాంటి పని చేస్తాడా..? దీనిని అసలు గొప్ప కథ అంటారా..? అలాంటి చెత్త కథని జనాలు ఎగబడి చూడడం ఏంటి ..? “అంటూ పరోక్షకంగా కే జి ఎఫ్ సినిమాను.. సినిమాలో నటించిన హీరో యష్ ను.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు . ప్రెసెంట్ వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

ప్రజెంట్ వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కట్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news