MoviesBalaya బాల‌య్య‌కు జోడీగా ఆ హాట్ ఐటెం గ‌ర్ల్ ఫిక్స్‌... వామ్మో...

Balaya బాల‌య్య‌కు జోడీగా ఆ హాట్ ఐటెం గ‌ర్ల్ ఫిక్స్‌… వామ్మో ర‌చ్చ రంభోలాయే…!

నందమూరి బాలకృష్ణ అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వీర‌సింహారెడ్డితో ఈ సంక్రాంతికి వ‌చ్చి దుమ్ము దులిపేశాడు. ఈ సినిమా త‌ర్వాత స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో త‌న 108వ ప్రాజెక్టులో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే క్రేజీ హీరోయిన్ శ్రీలీల బాల‌య్య కూతురు పాత్ర‌లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సినిమాలో బాల‌య్య 60 ఏళ్లు పై బ‌డిన వ్య‌క్తి పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. 14 ఏళ్ల పాటు తాను చేయ‌ని త‌ప్పుకు జైలు శిక్ష అనుభ‌వించి.. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌స్తాడు. బ‌య‌ట‌కు వ‌చ్చాక బాల‌య్య జీవితం ఎలా ? మారింది ? ఏం జ‌రిగింది ? అన్న క‌థాంశం నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ట‌. అలాగే ఈ సినిమా క‌థ అంతా తెలంగాణ నేప‌థ్యంతో కూడిన యాక్ష‌న్‌తో ఉంటుంద‌ని కూడా తెలుస్తోంది.

ఈ సినిమాలో బాల‌య్య డైలాగులు పూర్తిగా తెలంగాణ యాస‌లోనే చెపుతాడ‌ని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. మ‌రో హీరోయిన్ పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ హాట్ ఐటెం గ‌ర్ల్ నోరా ఫ‌తేహిని తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. ఈ పాత్ర‌కు నోరా ఫతేహి అయితేనే సరైన న్యాయం జరుగుతుందని అనిల్ రావిపూడి డిసైడ్ అయ్యార‌ట‌.

నోరా ఇప్ప‌టికే తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం ఉంది. తెలుగులో ఆమె ఇప్ప‌టికే టెంప‌ర్ – కిక్ 2 – లోఫ‌ర్ – బాహుబ‌లిలో ఐటెం సాంగ్ – షేర్ సినిమాల్లో న‌టించింది. ఇప్పుడు ఏకంగా ఈ హాట్ ఐటెం గ‌ర్ల్ బాల‌య్య సినిమాలో అంటే హాట్ ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news