Moviesఅబ్బాబ్బా..ఏం ఉన్నాడు రా బాబు..పవన్ సినిమా నుండి క్రేజీ ఫోటోలు లీక్..!

అబ్బాబ్బా..ఏం ఉన్నాడు రా బాబు..పవన్ సినిమా నుండి క్రేజీ ఫోటోలు లీక్..!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటు సినిమాలు.. ఓవైపు రాజకీయాలు అస్సలు పవన్‌కు క్ష‌ణం తీరిక ఉండ‌దు. వ‌చ్చే యేడాది ఎన్నిక‌ల నేప‌థ్యంలో పవన్ తన చేతిలో ఉన్న సినిమాలు అన్నింటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో తరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను ఈ సమ్మర్ కానుకగా మే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కోలీవుడ్ హిట్ మూవీ వినోదయసితం సినిమాకు రీమేక్ గా వస్తున్న సినిమా షూటింగ్ కూడా చకచక నడుస్తోంది.

పవన్ మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడు నటుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తెరవెనక అంతా నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందు నుంచి లీక్ ల‌ బెడద పట్టుకుంది. ఎంత జాగ్రత్త తీసుకున్నా.. సెట్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు స్మార్ట్‌ఫోన్‌తో ఆ ఫోటోలను తీసి బయటకు వదిలేస్తున్నారు.

ఈ ఫొటోలు నెట్లో పెట్టడం ఆలస్యం చకచక వైరల్ అయిపోతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ ఫోటోలు కావడంతో క్షణాల్లో ఎవరికి వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలో ఇప్పటికే మూడు నాలుగు స్టిల్స్ బయటకు వచ్చేసాయి. బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోటోల్లో ప‌వ‌న్ గ్లామ‌ర్ ప‌రంగా ఇర‌గ‌దీస్తున్నాడు. ప‌వ‌న్ వ‌య‌స్సు పెరుగుతున్నా వ‌న్నె ఏ మాత్రం త‌గ్గ‌డం లేదనేందుకు ఈ ఫొటోలే నిద‌ర్శ‌నం. ఈ సినిమా మేకర్స్‌ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫస్ట్ లుక్, టీజర్లపై ఆసక్తి తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా దర్శకుడు.. నిర్మాతలు సెట్ నుంచి ఒక్క స్టిల్ కూడా బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అప్పుడే సినిమా క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇక ఈ సినిమాను కూడా కంటిన్యూగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఏడాది పవన్ నుంచి రెండు సినిమాలు కచ్చితంగా రానున్నాయి. ఉస్తాద్‌ భగత్ సింగ్ షూటింగు కూడా కంప్లీట్ అయితే వచ్చే సంక్రాంతి లేదా డిసెంబర్‌లో రిలీజ్ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news