Movies"అదేంటో..ఎవ్వరికి రానివి ఆయనకే వస్తాయి"..నాని -రాజమూళిని తిట్టినట్లా..? పొగిడినట్లా..?

“అదేంటో..ఎవ్వరికి రానివి ఆయనకే వస్తాయి”..నాని -రాజమూళిని తిట్టినట్లా..? పొగిడినట్లా..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అష్టా చమ్మా సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని ..అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కాగా ఇండస్ట్రీలోకి హీరో అవ్వాలన్న పట్టుదలతో వచ్చిన నాని ఫైనల్లీ స్టార్ హీరోగా తన సత్తాను చాటుకున్నారు. ప్రజెంట్ దసరా సినిమాలో చేస్తున్న నాని రీసెంట్గా దర్శకధీరుడు రాజమౌళి గురించి సంచలన కామెంట్స్ చేశారు .

మనకు తెలిసిందే రాజమౌళి అంటే నానికి ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. నాని అంటే రాజమౌళికి కూడా చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాలలో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు . త్వరలోనే ఆరారార్ అస్కార్ అవార్డు అందుకోబోతుంది. మరో రెండు రోజుల్లోనే ఆస్కార్ అవార్డు చేత పట్టుకోబోతున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వెళ్ళిన హీరో నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆర్ ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందని బలంగా నమ్ముతున్నాను. భారతీయ సినిమా అనగానే అందరూ దక్షిణాదివైపే చూసేలా చేశారు రాజమౌళి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు జక్కన్న,, తన సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించాకే తెరకెక్కిస్తారు. ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అది ఏంటో ఎవరికి రాని ఐడియాలన్నీ ఆయనకే వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు ఎలా వస్తాయో కూడా అర్థం కాదు “అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే నాని రాజమౌళి పై చేసిన కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news