Moviesబాలయ్య కోసం రంగంలోకి దిగిన కూతురు.. ఇక అంతా రచ్చ రంబోలా..!!

బాలయ్య కోసం రంగంలోకి దిగిన కూతురు.. ఇక అంతా రచ్చ రంబోలా..!!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య రీసెంట్గా నటిస్తున్న సినిమా ఎన్బికె 108 . ఆయన లాస్ట్ గా నటించిన వీర సింహారెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అయిందో మనందరికీ బాగా తెలిసిందే . ఈ సినిమాలో ఆయనకు జోడిగా శృతిహాసన్ , మలయాళం హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. లేడీ విలన్ రోల్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించి మెప్పించింది. ఆ తర్వాత అన్ స్టాపబుల్ షోలో సందడి చేసిన బాలయ్య ప్రజెంట్ ఎన్.బి.కె 108 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో ఆయన కూతురుగా నటిస్తున్న శ్రీ లీల ఆయనకు కాల్ షీట్లు.. ఇవ్వట్లేదని ఆయనను హోల్డ్ లో పెడుతుందని.. నందమూరి అభిమానులను హార్ట్ చేస్తుంది అంటూ వరుసగా వార్తలు వినిపించాయి . ఇలాంటి క్రమంలోనే ఆ వార్తలకు చెక్ పెడుతూ ఎన్ వి కే 108 చిత్ర బృందం క్రేజీ అప్డేట్ ఇచ్చింది. షూటింగ్లో శ్రీ లీల జాయిన్ అవుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది . ఇందులో శ్రీలీల యాక్టీవ్ గా ఉండటం విశేషం.

అంతేకాదు బాలయ్య చేతిలో చెయ్యేసి కన్ను గీటు తో ఆమె సెట్ లో అడుగుపెడుతున్నట్లుగా ఓ ఫోటో ఉండడం అభిమానులకు కొత్త బూస్టప్ ఇచ్చింది.ఈ క్రమంలోనే రంగంలోకి కూతురు దిగిందని.. ఇక బాలయ్య సినిమా రచ్చ రచ్చగా మారబోతుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం నందమూరి బాలయ్య సినిమాలోకి శ్రీ లీల ఆఫర్ దక్కించుకుంది అంటే కచ్చితంగా అది అదృష్టమని అంటున్నారు ఫాన్స్ . చూడాలి మరి శ్రీలీల నందమూరి ఫ్యాన్స్ ని ఎలా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news