Moviesఈ హీరోయిన్లు బిజినెస్ ల ద్వార ఎంత కూడపెట్టారో తెలిస్తే.. దిమ్మతిరిగిపోద్ది..!!

ఈ హీరోయిన్లు బిజినెస్ ల ద్వార ఎంత కూడపెట్టారో తెలిస్తే.. దిమ్మతిరిగిపోద్ది..!!

సినిమా ఇండస్ట్రీలో కేవలం అందంతో పాపులారిటీ సంపాదించుకున్న నటీమణూలే కాదు ..బుర్ర పెట్టి ఆలోచించి వచ్చిన డబ్బుల్ని డబుల్ చేసే అందాల ముద్దలు గుమ్మలు ..టాలెంటెడ్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం రండి..!!

కీర్తి సురేష్: మహానటి గా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఒకో సినిమాకి నాలుగు కోట్లకు పైనే పారితోషకం అందుకునట్లు తెలుస్తుంది . కాగా అమ్మడు సినిమాలో చేస్తూనే మరోవైపు భూమిపుత్ర అనే పేరుతో సొంతంగా ఒక స్కిన్ కేర్ బ్రాండ్ ను ఏర్పాటు చేసుకుని ..అందులో సహజసిద్ధమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ..నెలకు నెలకు లక్షల్లో సంవత్సరానికి కోట్లల్లో ఆదాయం పొందుతుంది.

కాజల్ అగర్వాల్ : టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్.. రీసెంట్ గానే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ బాబుకు జన్మనిచ్చింది. కాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ ..మంచి మంచి అవకాశాలను అందుకుంటుంది . కేవలం హీరోయిన్ గానే కాదు జువెలరీ బిజినెస్ కూడా చేస్తుంది. కోట్లకు కోట్ల ఆస్తిని కూడ పెట్టేసుకుంటుంది.

తమన్నా : మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ఎంత టాలెంటెడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్కటంటే ఒక్క సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్న ఆ తర్వాత ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది . ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో బిజీగా ఉంటూనే మరోపక్క సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు సంపాదించుకుంది . అందుతున్న సమాచారం ప్రకారం తమన్న వద్ద రెండు వజ్రాల మూఠలు కూడా ఉన్నాయట. వైట్ అండ్ గోల్డ్ అనే పేరుతో ఒక బిజినెస్ ని రన్ చేస్తుంది.

ఇలియానా : గోవా బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేసిన ఇలియానా ప్రెసెంట్ సోషల్ మీడియా కే పరిమితమైంది . అయితే డబ్బులు సంపాదించుకున్నప్పుడే ఇలియానా గోవాలో ఓ బేకరీ ఓ రెస్టారెంట్లను నడిపించేటట్టు ప్లాన్ చేసుకుందట .ప్రజెంట్ దాని ద్వారా వచ్చిన సంపాదనతోనే అమ్మడు లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది అన్నట్లు తెలుస్తుంది . కేవలం వీళ్లే కాదు ఇంకా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ తమ బుర్రకు పదును పెట్టి వచ్చిన డబ్బులను డబుల్ చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news