Movies"రష్మిక కి ఆ హీరోతో ఎఫైర్".. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్...

“రష్మిక కి ఆ హీరోతో ఎఫైర్”.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో అందరికీ తెలిసిన విషయమే . ఏది ముట్టుకున్న కరెంట్ షాక్ కంటే ఎక్కువగా షాక్ కొడుతూ రష్మికకు బౌన్స్ బ్యాక్ గురవుతుంది. రీసెంట్గా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి . బాలీవుడ్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన గుడ్ బై, అలాగే మిషన్ మజ్ను సినిమా కెరియర్లో డిజాస్టర్ గా మిగిలాయి .

ఈ క్రమంలోనే బాలీవుడ్లో రష్మిక మందనను మరింతగా ట్రోల్ చేస్తున్నారు . కాగా ఇదే టైంలో రష్మిక అలాంటి వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . కాగా ఇదే క్రమంలో రష్మిక మందన పై వేణు స్వామి సంచలన కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో వేణు స్వామి సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత – హీరో నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అంటూ పెళ్లికి ముందే చెప్పి సంచలనాన్ని క్రియేట్ చేశారు .

ఆయన చెప్పినట్టే సమంత – చైతన్య విడాకులు తీసుకున్నారు . కాగా మరి కొంతమంది హీరో హీరోయిన్ల విషయంలో కూడా వేణు స్వామి చెప్పినట్లే జరిగింది . ఇలాంటి క్రమంలోని రష్మికపై ఆయన సంచలన కామెంట్స్ చేయడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. “రష్మిక మందనకు విజయ్ దేవరకొండ తో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పాను . అయినా వినలేదు ..అందుకే అతగాడి దరిద్రం ఆమెకు పట్టుకునింది ..విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఫ్లాప్ అవుతుందని ఎప్పుడో చెప్పాను ..అన్నట్టే జరిగింది . ఇదే కాదు రాబోయే రోజుల్లో కూడా విజయ్ దేవరకొండ కష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రష్మిక ఇప్పటికైనా అతగాడితో ఫ్రెండ్షిప్ కట్ చేయకుండా ఉంటే కచ్చితంగా ఆమె కెరియర్ మరింత చిక్కుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది” అంటూ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో వేణు స్వామి , రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news