Movies"సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఓ ఛండాలం".. సాయి పల్లవి సీరియస్ కామెంట్స్...

“సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఓ ఛండాలం”.. సాయి పల్లవి సీరియస్ కామెంట్స్ వైరల్..!!

సాయి పల్లవి ఓ అందాల తార ..అందాల ముద్దుగుమ్మ .. మహానటి. ఇలా ఎన్ని ట్యాగ్స్ వేయించుకుందో అందరికీ తెలిసిందే. ప్రజెంట్ లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుని సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది . మనకు తెలిసిందే ఆమె లాస్ట్ గా నటించినా మూడు సినిమాలలో ఓ సినిమా హిట్ అయింది ..మిగతా రెండు డిజాస్టర్ గా మారాయి .

అయితే సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి . ఆమె లాస్ట్ గా నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు డిజాస్టర్ గా మారాయి . రెండు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కావడంతో సాయి పల్లవి అనుకున్నంత హిట్ కాలేకపోయాయి . ఈ క్రమంలోనే సినిమాలకు కొన్నాళ్లు దూరంగా ఉండాలి అంటూ డిసైడ్ అయింది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే అదంతా ఫేక్ మంచి కంటెంట్ , కథ దొరికితే సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది .

రీసెంట్ గా స్మిత తో ఓఅ టాక్ షోలో పాల్గొనింది సాయి పల్లవి. అంతేకాదు ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 10 న సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న సాయి పల్లవి హాట్ కామెంట్స్ చేసినట్లు ప్రోమో ఆధారంగా తెలుస్తుంది . ఈ ఎపిసోడ్ నుంచి ఒక ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఇందులో సాయి పల్లవి కాస్త గట్టిగానే రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది . దీంతో సినీ ఇండస్ట్రీలో జరిగే అరాచకాలపై సాయి పల్లవి రియాక్ట్ అయింది అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు సాయి పల్లవికి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైంది అని ..అందుకే ఇలాంటి ఫిజికల్ అబ్యూస్ అనే కామెంట్స్ చేసింది.. సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఓ చండాలం అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి సాయిపల్లవి దేని గురించి రియాక్ట్ అయిందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news