Moviesరేణుదేశాయ్‌తో విడిపోవ‌డానికి కార‌ణం ఫ‌స్ట్ టైం రివీల్ చేసిన ప‌వ‌న్‌…!

రేణుదేశాయ్‌తో విడిపోవ‌డానికి కార‌ణం ఫ‌స్ట్ టైం రివీల్ చేసిన ప‌వ‌న్‌…!

అభిమానుల నిరీక్ష‌ణ‌కుల ఎట్ట‌కేల‌కు తెర‌దించుతూ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, న‌ట‌సింహం బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ పార్ట్ 1 గ‌త రాత్రి ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ప‌వ‌న్ రాజ‌కీయాల‌పై ఎలాంటి కామెంట్ చేస్తారు ? ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల విష‌యంపై ప‌వ‌న్ స్పంద‌న ఎలా ? ఉంటుంది ? బాల‌య్య ప్ర‌శ్న‌లు ప‌వ‌న్‌ను ఇర‌కాటంలో పెడ‌తాయా ? ప‌వ‌న్ రిటాక్ట్ ఎలా ? ఉంటుంది ఇలా చాలా సందేహాలు ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలోనూ మెదిలాయి

ఎట్ట‌కేల‌కు ఈ ఉత్కంఠ‌కు గ‌త రాత్రి ఎపిసోడ్‌లో తెర‌దించేశారు. ఇక త‌న మూడు పెళ్లిళ్ల గురించి బ‌య‌ట ర‌క‌ర‌కాలుగా జ‌రుగుతున్న ప్ర‌చారాల‌కు ప‌వ‌న్ సుధీర్ఘ‌మైన వివ‌ర‌ణ‌తో చెక్ పెట్టేశారు. ఈ పెళ్లిళ్ల గోల ఏంట‌ని బాల‌య్య ప్ర‌శ్నించ‌గా ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల గురించి కాస్త డీటైల్‌గానే క్లారిటీ ఇచ్చాడు. త‌న మొద‌టి పెళ్లి జ‌రిగిన‌ప్పుడు త‌న‌కు పెళ్లి గురించి స‌రైన అవ‌గాహ‌న లేద‌ని.. అస‌లు తాను పెళ్లిపై ప్రిపేర్ కూడా కాలేద‌ని.. త‌న ఇష్టాల‌తో సంబంధం లేకుండా కుటుంబ స‌భ్యులు పెళ్లి చేశారు.

అలా అభిప్రాయాలు కుద‌ర‌క మొద‌టి భార్య‌తో విడిపోవాల్సి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ చెప్పాడు. ఇక రేణుదేశాయ్‌ను ప‌వ‌న్ ఎంతో ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్నాడు. అంత‌లా ప్రేమించిన ఆమెను ప‌వ‌న్ ఎందుకు వ‌దులుకున్నాడు ? అన్న‌ది చాలా మందికి ఇప్ప‌ట‌కీ అంతుప‌ట్ట‌దు. దీనికి కూడా ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చాడు. రెండో భార్య‌తో కూడా అభిప్రాయాలు కుద‌ర్లేద‌ని.. అలా ఆమెతో కూడా విడిపోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు.

అస‌లు త‌న‌కు మొద‌టి పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న లేద‌ని.. తాను యోగిలా మారాల‌ని అనుకున్నాన‌ని.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాల‌ని అనుకున్నా.. అనూహ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు. త‌న‌ను విమ‌ర్శించే వాళ్ల‌కు ఏ పాయింట్ లేక‌పోవ‌డంతో దానిని బ‌ట్టుకుని విమ‌ర్శ‌లు చేస్తుంటార‌ని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

త‌న‌ను విమ‌ర్శించే వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి త‌న‌కు తెలుసు అని.. అయితే వాళ్ల ఇళ్ల‌ల్లో ఆడ‌ప‌డుచుల‌ను అన‌డం ఏ మాత్రం స‌మ‌జ‌సం కాద‌ని.. అందుకే తాను వాళ్ల‌లా మాట్లాడ‌లేన‌ని ప‌వ‌న్ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఏదేమైనా త‌న పెళ్లిళ్ల గురించి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ప‌వ‌న్ మాత్రం సంస్కార‌వంతంగా వ్య‌వ‌హ‌రించ‌డం మెచ్చుకోద‌గ్గ‌దే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news