Moviesశంక‌రాభ‌ర‌ణం హిట్ అయిన ఈమె జీవితం సర్వ నాశనం.. కారణం...

శంక‌రాభ‌ర‌ణం హిట్ అయిన ఈమె జీవితం సర్వ నాశనం.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

శంక‌రాభ‌ర‌ణం.. సినిమా ఎంత సూప‌ర్ హిట్టో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌ధానంగా అంద‌రినీ ఆక‌ర్షించిన‌.. సినిమా అంతా కూడా ఆమె చుట్టూనే తిప్పుకొన్న న‌టి మంజు భార్గ‌వి. ఈమె క‌న్న‌డ సినీ న‌టి. అప్ప‌టికి మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్‌. క‌న్నడంలో మంచి పేరున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఒక ఫంక్ష‌న్‌లో అప్ప‌టి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కే విశ్వ‌నాథ్‌కు ఎవ‌రో ప‌రిచ‌యం చేశారు.

చూడ‌గానే విశ్వ‌నాథ్‌కు భార్గ‌వి న‌చ్చేశారు. ఆమెను త‌దుప‌రి సినిమాలో తీసుకోవాల‌ని అనుకున్నారు. వాస్త వానికి అప్ప‌టికి హీరోయిన్‌గా ఉన్న భార్గ‌వి.. శంక‌రాభ‌ర‌ణం సినిమాను చేసేందుకు ఒప్పుకోలేదు. ఎందుకం టే దీనిలో ఎలాంటి డ్యూయెట్ లేదు. హీరో లేడు. కేవ‌లం క‌థే హీరో. పైగా.. అంతా శాస్త్రీయ సంగీతం. త‌న ఇమేజ్ ఎక్క‌డ దెబ్బ‌తింటుందో అనుకున్నార‌ట‌. అయితే.. ఈ విష‌యంలో రాజ్‌కుమార్ జోక్యం చేసుకుని విశ్వ‌నాథ్‌తో సినిమా అంటే మాట‌లు కాద‌ని ఒప్పించార‌ట‌.

ఇలా.. శంక‌రాభ‌ర‌ణంలో ఒప్పుకొన్న మంజుభార్గ‌వి.. ఈ సినిమాలో త‌న డ్యాన్స్‌తో అంద‌రినీ అల‌రించారు. పెద్ద పేరు వ‌చ్చేసింది. అయితే.. ఆ త‌ర్వాత ఆమె ముందుగా ఊహించిన‌ట్టుగానే సినిమాలు త‌గ్గిపోయా యి. అప్ప‌టి వ‌ర‌కు తిరుగులేద‌ని అనుకున్న మంజుకు.. ఒక్క‌సారిగా గ్రాఫ్ ప‌డిపోయింది. అంతేకాదు.. మంజు భార్గ‌విని ఒక దేవ‌త‌గా భావించేసి పూజించ‌డం కూడా మొద‌లు పెట్టారు. దీంతో ఆమె ప‌రిస్థితి ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిగా మారిపోయింది.

అవ‌కాశాలు రాక‌.. అలాగ‌ని.. పొగిడేవారు లేక‌కాదు.. అనేక మంది ఉన్నారు. మ‌రి ఆర్థికంగా ఎలా పుంజుకునే ది? అనుకున్న స‌మ‌యంలోనే డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేసుకున్నార‌ట‌. నిజానికి శంక‌రాభ‌ర‌ణంతో పేరు వ‌చ్చినా.. త‌ర్వాతఅవ‌కాశాలు స‌న్న‌గిల్లిన ఏకైక న‌టీమ‌ణి.. మంజు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ సినిమాలో న‌టించిన అంద‌రూ కూడా త‌ర్వాత కాలంలో బాగా పుంజుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news