Moviesప్రేమ పెళ్లి చేసుకుందని హేమను చావచిత‌క్కొట్టింది ఎవ‌రు.. స‌ఖి సినిమాను మించిన...

ప్రేమ పెళ్లి చేసుకుందని హేమను చావచిత‌క్కొట్టింది ఎవ‌రు.. స‌ఖి సినిమాను మించిన ట్విస్టులు..!

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది. ఎప్పుడు గలగల మాట్లాడేస్తూ ఉంటుంది. హేమ ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు దాటింది. ఎప్పుడో క్షణం క్షణం సినిమా టైంలోనే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తానేంటో ప్రూవ్ చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 17 నుంచి 18 సంవత్సరాలు మాత్రమే. ఆ టైంలో ఇటు సినిమాలతో పాటు దూరదర్శన్ లో చిన్న చిన్న సీరియల్స్ లో నటించేది.

ఆ సీరియల్స్ కు టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్టర్‌గా వ్యవహరించే వారు. అలాగే సినిమాటోగ్రాఫర్‌గా మీర్‌ ఉండేవారు. ఆ సమయంలోనే ప్రేమలో పడిపోయింది హేమ. మీర్‌కు అసిస్టెంట్ గా ఉన్న ఆయన సోదరుడు జాన్ అప్పుడప్పుడు సెట్స్‌కు వస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజు హేమ తన స్నేహితులతో కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్లే ప్రయత్నాల్లో ఉంది. ఆ విషయం తెలుసుకున్న జాన్ తాను కూడా ఎగ్జిబిషన్‌కు వస్తానని రిక్వెస్ట్ చేశాడట. వెంటనే హేమ అదేముంది రావచ్చు అని చెప్పిందట.

ఎగ్జిబిషన్ కి వెళ్లి అక్కడ సరదాగా కాసేపు గడిపిన వెంటనే జాన్‌ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా ? అని అడిగేసాడట. హేమ కాస్త షాక్ అయినా నిజంగా మోసం చేసేవాడు అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పడు కదా అన్న‌ ఆలోచనలోకి వెళ్లిపోయిందట. కొద్దిరోజుల పరిచయంలోనే వారిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒక రోజు ఎవరికీ తెలియకుండా నెల రోజుల ముందుగానే ఏర్పాట్లు చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు స‌ఖీ సినిమాలో హీరో, హీరోయిన్‌లాగా ఉంటున్నామ‌ని చెప్పింది.

అయితే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న విషయం గమనించిన జాన్ అన్న మీర్‌ ఈ విషయాన్ని హేమతల్లికి చెప్పాడట. ముందుగా కెరీర్ మీద దృష్టి పెట్టకుండా 18 ఏళ్లకే ప్రేమ దోమా ఏంటని ? హేమ తల్లి హేమను పట్టుకుని పిచ్చకొట్టడు కొట్టిందట. ప్రేమలో పడితే ఊరుకోను అని చావచితకొట్టేసిందట. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అన్న విషయాన్ని రెండు కుటుంబాల పెద్దలకు చెప్పారట. చివరకు వారు అంగీకరించి ఒకరోజు గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి ఆశీర్వదించారట.

ఆ రిసెప్షన్ లోనే హేమ, జాన్ తమకు ఇంతకుముందే రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిందని చెప్పారట. అయితే తాను పెళ్లి చేసుకునే సమయానికే మంచి మంచి సినిమాలు.. మంచి మంచి పాత్రలతో బాగా పేరు తెచ్చుకున్నానని.. ఇక త‌న‌ భర్త జాన్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిపింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం భవిష్యత్తులో తలాక్ తలాక్ అని విడాకులు ఇచ్చేస్తారేమోనని ముందే ఆలోచనతోనే తాను తెలివిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని హేమ చెప్పింది. ఇక హేమ ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ ఉంటున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news