Movies"నా తమ్ముడిని ఆ తెలుగు హీరోలోనే చూసుకుంటున్నా"..శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్...

“నా తమ్ముడిని ఆ తెలుగు హీరోలోనే చూసుకుంటున్నా”..శివరాజ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్ ..!!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి న విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఎన్నో సామాజిక సేవలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ .. సినిమా ఇండస్ట్రీలో కూడా హిట్ సినిమాలలో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు . కాగా వ్యాయామాలు చేస్తున్న టైంలో హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలిన పునీత్ రాజ్ కుమార్ .. హాస్పిటల్ కి తీసుకెళ్తున్న తరుణంలోనే కన్నుమూశారు .

ఆయన మరణించిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . ఆయన మరణించి దాదాపు రెండేళ్లు కావస్తుంది. ఇప్పటికి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు . కాగా రీసెంట్గా పునీత్ రాజ్ కుమార్ అన్న శివరాజ్ కుమార్ నటించిన వేద సినిమా తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో .. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో భారీ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే తమ్ముడిని తలుచుకొని శివరాజ్ కుమార్ చాలా ఎమోషనల్ అయ్యాడు . బాలయ్య ఎంత ఓదారుస్తున్న ఆయన కంట్రోల్ అవ్వలేదు. శివరాజ్ కుమార్ ని ఆపడం బాలయ్య తరం కాలేదు . మన మధ్య పునీత్ లేడు అన్న విషయాన్ని తలుచుకుంటుంటేనే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి అంటూ ఎమోషనల్ అయ్యాడు. “పునీత్ మన మధ్య లేకపోయినా తనని నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ లో చూసుకుంటున్నాను .. నా తమ్ముడిలాగే అల్లు అర్జున్ డాన్సింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం.. అల్లు అర్జున్ ని ఎప్పుడు చూసినా నాకు తమ్ముడే గుర్తొస్తాడు” అంటూ పునీత్ ను గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు . ఈ క్రమంలోని ర్ శివరాజ్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news