MoviesRRR "ఇది ప్రతి ఇండియన్ గర్వపడే రోజు".. స్టేజ్ ఎక్కి తెల్లోలను...

RRR “ఇది ప్రతి ఇండియన్ గర్వపడే రోజు”.. స్టేజ్ ఎక్కి తెల్లోలను దడదడలాడించిన రాజమౌళి..!!

ప్రజెంట్ ప్రపంచ దేశాలలో మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. గల్లి నుంచి ప్రపంచ దేశాలలో ఉండే ప్రధాన నగరాలలో కూడా ఆర్ఆర్ఆర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దీనంతటికీ కారణం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి . ఇద్దరు బడా హీరోలతో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాను ప్రపంచ దేశాలు గర్వించ తగ్గే విధంగా తెరకెక్కించి ఇప్పుడు మన తెలుగు సినిమా ని ఆస్కార్ కి సైతం నామినేట్ చేసేలా చేశాడు రాజమౌళి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పాలు అవార్డ్స్ తో సంచలన రికార్డ్లు అందుకుంది. అయితే తాజాగా మరో క్రేజీ అవార్డ్స్ కూడా అందుకుని ఇండియన్స్ అంటే ఇది అనే సత్త చాటింది.

తాజాగా ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికాలోని ప్రతిష్టాత్మకంగా ఇచ్చే హాలీవుడ్ ఫిలిం అసోసియేషన్ అవార్డ్స్ లో కూడా ఏకంగా నాలుగు కేటగిరీల్లో గెలుపొంది సంచలన రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలా ఒకే సినిమాకి నాలుగు కేటగిరీల్లో అవార్డు అందుకున్న ఏకైక సినిమాగా ఆర్ఆర్ఆర్ సంచలన రికార్డును నెలకోల్పింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్సీఏ అవార్డులలో బెస్ట్ స్టాండ్స్ ..బెస్ట్ యాక్షన్ మూవీ.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగాలలో గెలుపొంది. ఈ క్రమంలోనే అవార్డు తీసుకున్న రాజమౌళి – రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. మరి ముఖ్యంగా అవార్డు తీసుకున్న తరువాత.. రాజమౌళి స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ.. తెల్లోలని తన స్పీచ్ తో దడదడ లాడించాడు .

ఆయన మాట్లాడుతూ..”మా సినిమాను ఆదరించిన అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదులు. షూటిగ్ టైంలో మేము పడిన కష్టమంతా ఇప్పుడు ఈ అవార్డు రూపంలో మాకు దక్కింది . ఈ చిత్రంలో స్టంట్స్ చేసేందుకు ఎంతో కష్టపడినా కొరియోగ్రాఫర్స్ కి ముందుగా చాలా చాలా థాంక్స్ . ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం కష్టపడిన స్టాండ్ మాస్టర్ బుజ్జి కి థాంక్స్. ఇది నా విజయం ఒక్కడిదే కాదు.. భారతదేశానికి దక్కిన ఈ గౌరవాన్ని నేను ఇండియన్స్ అందరికీ అంకితం చేస్తున్నాను “అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు రాజమౌళి. ఈ క్రమంలోనే రాజమౌళి కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news