Movies"అలాంటి గుడ్ న్యూస్ ఉంటే..ఏదైన మొదట మీకే చెప్తా..ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి...

“అలాంటి గుడ్ న్యూస్ ఉంటే..ఏదైన మొదట మీకే చెప్తా..ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి రా “..!!

ఫైనల్లీ .. ఎన్టీఆర్ థర్టీపై తారక్ అదిరిపోయే క్లారిటీ ఇచ్చాడు అభిమానులకి ..రీసెంట్గా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమా అమిగోస్. బింబిసారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్రామ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా.. ఫిబ్రవరి 10న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తుంది .

కెరియర్ లోనే ఫస్ట్ టైం కళ్యాణ్రామ్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నాడు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ లుక్స్ పాటలు ప్రజలను అమితంగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా హైదరాబాద్లో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేసారు. ఈ ఈవెంట్ కి బ్రదర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అధితిగా హాజరయ్యారు . కాగా తన ఆరోగ్యం బాగోలేనప్పటికీ తమ్ముడు కోసం వచ్చాను అంటూ స్టేజి పైకి వచ్చిన ఎన్టీఆర్ చెప్పడం ఆశ్చర్యకరంగా అనిపించింది.

అంతేకాదు ఎన్టీఆర్ స్టేజిపై ఎక్కినప్పటి నుంచి అభిమానులు ఒకటే గోల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మైక్ తీసుకుని “నా ఆరోగ్యం బాగోలేదు.. బాడీపెయిన్స్.. బాడీ సహకరించట్లేదు ..ప్లీజ్ కొంచెం నన్ను అర్ధం చేసుకోండి .. గోల చేయవద్దు” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇదే క్రమంలో అమిగోస్ సినిమా గురించి మాట్లాడిన తర్వాత తారక్ ఎన్టీఆర్ థర్టీ పై నోరు విప్పారు .

గత కొంతకాలంగా ఎన్టీఆర్ థర్టీ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వట్లేదు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే ఘాటుగా ఇచ్చి పడేసాడు. ” ఎన్టీఆర్ థర్టీ సినిమా చాలా కొత్తగా ఉంటుంది ..దయచేసి ఎ సినిమాపై అప్డేట్ ఇస్తాం కూల్ గా ఉండండి .. మన తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో ప్రసిద్ధి చెందింది ..ఇప్పుడు మనం చేసే ప్రతి సినిమా జాగ్రత్తగా తీయాలి ..తొందరపడి డైరెక్టర్స్ ని ఇబ్బంది పెట్టొద్దు.. సినిమా నుంచి ఏదైనా గుడ్ న్యూస్ ఉంది అంటే మా ఇంట్లో వాళ్లకి చెప్పకుండా కూడా ముందు ఆ న్యూస్ మీకే చెప్తాం ..మాకు అభిమానుల తర్వాతే ఎవరైనా ..దయచేసి అర్ధం చేసుకోండి .” అంటూ చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే తారక్ మాటల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news