Moviesక‌ళ్యాణ్‌రామ్ ' అమిగోస్ ' ట్రైల‌ర్‌… అరాచ‌కం అమ్మ మొగుడే (...

క‌ళ్యాణ్‌రామ్ ‘ అమిగోస్ ‘ ట్రైల‌ర్‌… అరాచ‌కం అమ్మ మొగుడే ( వీడియో)

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ చాలా రోజుల త‌ర్వాత గ‌తేడాది బింబిసార సినిమాతో సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. సీతారామం లాంటి క‌ల్ట్ క్లాసిక్ సినిమాకు పోటీగా వ‌చ్చి కూడా కెరీర్ ప‌రంగా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. అదే బింబిసార సోలోగా వ‌చ్చి ఉంటే అదిరిపోయే వ‌సూళ్లు సాధించి ఉండేది. ఇక బింబిసార త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన సినిమా అమిగోస్‌

మైత్రీ మూవీ మేక‌ర్స్ లాంటి పెద్ద బ్యాన‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. ముందు నుంచే ఈ సినిమా టైటిల్‌, లోగో, కాన్సెఫ్ట్‌, క‌ళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభిన‌యం అన్నింటిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఈ నెల 10న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే ప్రి రిలీజ్ బిజినెస్ కూడా కంప్లీట్ అయ్యింది. ఎలాంటి హ‌డావిడి లేకుండా ఈ రోజు ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. అదిరిపోయింది. క‌ళ్యాణ్‌రామ్ మూడు పాత్ర‌ల్లో అరాచ‌కం చూపించేశాడు. ఓవ‌రాల్‌గా ట్రైల‌ర్ అదిరిపోయింది. ట్రైల‌ర్ చూస్తుంటే క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్న‌ట్టుగా ఉంది. ఈ సినిమాలో మూడు పాత్ర‌లు ఒకేలా క‌నిపించినా ఇది బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య రిలేష‌న్ కాదు.. ఫ్రెండ్‌షిఫ్ రిలేష‌న్ కాద‌ని క్లారిటీ ఇచ్చేశారు.

క‌ళ్యాణ్‌రామ్ గెడ్డంతో ఉన్న పాత్ర‌లో ఫుల్ నెగ‌టివ్ షేడ్స్‌లో ఉంది. అస‌లు ఆ పాత్ర‌తో పాటు డైలాగులు చూస్తుంటే గూస్‌బంప్స్‌తో పాటు భ‌యంక‌రంగా కూడా ఉంది. ఈ విల‌న్ పాత్ర‌తో మిగిలిన రెండు పాత్ర‌లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయ‌న్న కాన్సెఫ్ట్‌తో అమిగోస్ సినిమా తెర‌కెక్కింది. ట్రైల‌ర్‌లో క‌ళ్యాణ్‌రామ్ 3 పాత్ర‌ల‌ను బాగా ఎస్టాబ్లిష్ చేశారు.

ఇక ట్రైల‌ర్లో ముగ్గురు క‌ళ్యాణ్‌రామ్‌లు ఒక‌రితో ఒక‌రు ఫైట్ చేసే షాట్ కూడా చూపించారు. ఇక బాల‌య్య ఎన్నో రాత్రులు వ‌స్తాయి రీమిక్స్ సాంగ్‌తో పాటు మ‌రో సాంగ్ కూడా అదిరిపోయేలా ఉంది. హీరోయిన్ గ్లామ‌ర్ డోస్‌తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు కూడా చోటు క‌ల్పించారు. ఏదేమైనా ట్రైల‌ర్ చూస్తుంటే ఖ‌చ్చితంగా క‌ళ్యాణ్‌కు మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా అనేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news