Moviesవిజయ్ వర్మ తో పెళ్ళి..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన తమన్నా ఎక్స్ బాయ్...

విజయ్ వర్మ తో పెళ్ళి..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన తమన్నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్..!?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా .. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా ..సినిమాలు చేస్తూ తన పేరుని మరింత పాపులారిటీ దక్కించుకుంటుంది . కాగా రీసెంట్గా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది .

విజయ్ వర్మ ఎవరో కాదు .. టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించిన నటుడే ఈ విజయ్ వర్మ . కాగా గత కొంతకాలంగా విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది తమన్నా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇలాంటి క్రమంలోనే న్యూ ఇయర్ సందర్భంగా తమన్నా – విజయ్ వర్మ ను లిప్ లాక్ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది .

కాగా అందుతున్న సమాచారం ప్రకారం తమన్న త్వరలోనే విజయ్ తో పెళ్ళికి సిద్ధపడినట్లు తెలుస్తుంది . ఇలాంటి క్రమంలోనే తమన్న ఒకప్పటి బాయ్ ఫ్రెండ్ గా చెప్పుకునే కోలీవుడ్ హీరో ఆమెకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది , ఇన్నాళ్లు తమన్నా ని పట్టించుకోని ఆ స్టార్ హీరో ఇప్పుడు అతగాడి నెక్స్ట్ సినిమాలో తమన్నాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి టైంలోనే తమన్న పై ఇంకా ఆ హీరోకి మోజు తీరలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో విజయ్ వర్మ తో తమన్న పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news