Moviesజబర్ధస్త్ వర్ష ఎంగేజ్మెంట్ కి రెడి అయిపోయిందోచ్.. పెళ్ళి కొడుకు ఎవరో...

జబర్ధస్త్ వర్ష ఎంగేజ్మెంట్ కి రెడి అయిపోయిందోచ్.. పెళ్ళి కొడుకు ఎవరో తెలుసా..?

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మలలో జబర్దస్త్ వర్షా కూడా ఒకరు. గత కొన్ని నెలల వరకు ఈ పేరు ఎవరికీ గుర్తులేదు. అసలు తెలియదు ..అయితే జబర్దస్త్ పుణ్యమా అంటూ వర్ష పేరు మారుమ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ ఇమ్మన్యూయేల్ తో వర్షా చేసే రచ్చ అంతా కాదు . అతగాడితో ప్రేమాయణం నడుపుతున్నట్లు ఇచ్చే కవరింగ్ వామో చూడడానికి ఓ విధంగా ఉంటుంది .

అయితే ఇదంతా నిజమా అంటే కాదనే చెప్పాలి .. అంత స్కిట్ లో భాగంగా టిఆర్పీల కోసమే చేస్తున్నారు అని అందరికీ తెలిసిందే. కానీ అదేదో సరదా ..తెరపై వాళ్ళిద్దరూ అల నటిస్తూ ఉంటే చూడడానికి చక్కగా అనిపిస్తుంది . అందుకే జనాలు ఎగబడి చూస్తూ ఉంటారు . అంతేకాదు జబర్దస్త్ వర్షా పలు ఈవెంట్స్ లో మెరిసి అభిమానులను అలరిస్తూ ఉంటుంది .

ఎక్కడైనా సరే చలాకీగా నవ్వుతూ సరదా సరదాగా ఉండడం ఆమెకు అలవాటు. రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్ లో వర్ష పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయాను అంటూ పెట్టిన క్యాప్షన్ అభిమానులకు షాకింగ్ అనిపించింది . అయితే జబర్దస్త్ వర్షా ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయిన వార్త నిజమే కానీ అది ఆమె ఎంగేజ్మెంట్ కాదు.. జబర్దస్త్ తోటి కమెడియన్ రాకింగ్ రాకేష్ ఎంగేజ్మెంట్ కి . మనకు తెలిసిందే రాకింగ్ రాకేష్ -జోర్ధార్ సుజాత ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతూ జబర్దస్త్ వర్షా చేసిన వీడియో సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. త్వరలోనే నా ఎంగేజ్మెంట్ కూడా ఉంది అంటూ హింట్ ఇచ్చేసింది ఈ చిన్నది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news