Moviesఅదితిరావు ఫ‌స్ట్ భ‌ర్త‌కు అంత టార్చ‌ర్ చూపించిందా.. ఇప్పుడు సిద్ధార్థ్‌తోనూ…!

అదితిరావు ఫ‌స్ట్ భ‌ర్త‌కు అంత టార్చ‌ర్ చూపించిందా.. ఇప్పుడు సిద్ధార్థ్‌తోనూ…!

అదితీరావు హైదరీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా నానుతోన్న పేరు. ఆమె వ‌య‌స్సు పెద్ద‌దే. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి కూడా చాలా యేళ్లు అవుతోంది. ముమ్ముట్టి న‌టించిన ప్ర‌జాపతి సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ త‌ర్వాత ఢిల్లీ 6, దోభీ ఘాట్‌, రాక్‌స్టార్‌, మ‌ర్డ‌ర్ 3 సినిమాల‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత తెలుగులో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్‌బాబు హీరోగా వ‌చ్చిన స‌మ్మోహ‌నం సినిమాలో న‌టించి ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది.

మంచి న‌ట‌న‌తో పాటు క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఆమె సొంతం. అన్నింటికి మించి అదితీరావు మ‌న హైద‌రాబాదీ అమ్మాయే. రెండేళ్ల క్రితం సిద్ధార్థ్‌, శ‌ర్వానంద్‌తో క‌లిసి ఆమె చేసిన మ‌హాస‌ముద్రం సినిమా ప్లాప్ అయినా కూడా మంచి పేరు వ‌చ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలో సిద్ధార్థ్‌తో ఏర్ప‌డిన స్నేహం కాస్తా ఇప్పుడు ప్రేమ‌గా మారింది. గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రు డేటింగ్‌లో మునిగి తేలుతున్నారు.

ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రే చ‌క్కెర్లు కొడుతున్నారు. అయితే ఈ వార్త‌లు నిజం చేస్తూ రీసెంట్‌గా హీరో శ‌ర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు వీరు జోడీగా వ‌చ్చి మ‌రీ త‌ళుక్కుమ‌న్నారు. శ‌ర్వా దంప‌తుల‌తో క‌లిసి మ‌రీ ఫొటోల‌కు పోజులు ఇచ్చారు. ఇక వీరిద్ద‌రు కూడా త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అంద‌రూ ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే అదితారావు హైద‌రీపై మాజీ భ‌ర్త స‌త్య‌దీప్ మిశ్రా ఇప్పుడు సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశాడు.

కెరీర్ స్టార్టింగ్‌లోనే ఆమె 2009లో బాలీవుడ్ న‌టుడు స‌త్య‌దీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత 2013లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఈ ఇద్ద‌రు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా ఉంటున్నార‌ను. రీసెంట్‌గా స‌త్య‌దీప్ మిశ్రా బాలీవుడ్ న‌టి నీనా గుప్తా కూతురు మ‌స‌బా గుప్తాను ( విండీస్ స్టార్ క్రికెట్ దిగ్గ‌జం వివియ‌న్ రిచర్డ్స్ ద్వారా క‌లిగిన కూతురు) వివాహం చేసుకున్నాడు.

ఈ సంద‌ర్భంగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ అదితిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆమెతో రిలేష‌న్ షిప్ వ‌ల్ల నాకు ప్రేమ‌పై విర‌క్తి క‌లిగింద‌ని.. మ‌రోసారి ప్రేమ అంటేనే భ‌యం వేసింద‌న్నాడు. బ్రేక‌ప్ త‌ర్వాత కొంద‌రు మ‌ళ్లీ రిలేష‌న్ అంటేనే భ‌య‌ప‌డ‌తారు. కానీ ధైర్యంగా ముందుకు వేస్తేనే మ‌నం కోల్పోయిన‌వి పొందుతాం అని స‌త్య‌దీప్ చెప్పాడు. ఏదేమైనా స‌త్య‌దీప్ చేసిన వ్యాఖ్య‌ల‌తో అదితిరావు హైద‌రీతో ప్రేమ వ‌ల్లే విర‌క్తి క‌లిగింద‌ని చెప్ప‌డంతో ఆమె నుంచి ఎంతో టార్చ‌ర్ అనుభ‌వించిన‌ట్టుగా చెప్పిన‌ట్ల‌య్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news