Moviesవేణుస్వామి ప్రేమ‌కు ఎక్క‌డ గంట కొట్టాడో తెలుసా... భార్య వీణా శ్రీవాణితో...

వేణుస్వామి ప్రేమ‌కు ఎక్క‌డ గంట కొట్టాడో తెలుసా… భార్య వీణా శ్రీవాణితో ఎక్క‌డ ల‌వ్‌లో ప‌డ్డాడంటే…!

ప్ర‌స్తుతం ఏ రంగంలో ఉన్న సెల‌బ్రిటీలు అయినా న‌మ్మ‌కాలు, సెంటిమెంట్ల‌తో పాటు జ్యోతిష్యాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక సినిమా రంగంలో సెంటిమెంట్లు, ముహూర్తాలు ఫాలో అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక సినిమా వాళ్ల‌కు జ్యోతిష్యం చెప్ప‌డంలో బాగా పాపుల‌ర్ అయ్యాడు ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణుడు వేణుస్వామి.

వేణుస్వామి సినిమా వాళ్ల విష‌యంలో చెప్పిన జోస్యాలే చాలా వ‌ర‌కు నిజం కావ‌డంతో ఆయ‌న చెప్పే మాట‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త ఎక్కువుగా ఉంద‌నే న‌మ్ముతున్నారు. స‌మంత – చైతు విడాకుల విష‌యంలో ఆయ‌న ముందే చెప్పిందే జ‌ర‌గ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న చెప్పిన విష‌యాల‌పై మ‌రింత ఆస‌క్తి పెరుగుతోంది.

రెండు నెల‌ల క్రిత‌మే వేణుస్వామి త్వ‌ర‌లోనే 45 ఏళ్ల లోపు వ‌య‌స్సు ఉన్న ఓ టాలీవుడ్ హీరో, హీరోయిన్ చ‌నిపోతాడ‌ని చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే తార‌క‌ర‌త్న 40 ఏళ్ల‌కే చ‌నిపోయారు. దీంతో చాలా మంది వేణుస్వామి ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌రీ త‌మ జాత‌కం చూపించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వేణుస్వామి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా హైలెట్ అవుతున్నాయి. ఆయ‌న భార్య వీణా శ్రీ వాణి త‌మ ప్రేమ వివాహాన్ని ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

ఇక వీణ ఆర్ఆర్‌బీ ( రైల్వే రిక్రూట్‌మెంట్‌) బోర్డు ఎగ్జామ్‌లో స్టేట్ ర్యాంక‌ర్‌. ఆమె ట్రైనింగ్ నిమిత్తం హైద‌రాబాద్‌కు వ‌చ్చార‌ట‌. ఆమె త‌న ఖ‌ర్చుల కోసం హైద‌రాబాద్‌లో వీణ క్లాసులు చెప్పేవార‌ట‌. ఈ క్ర‌మంలోనే వేణుస్వామి త‌న క‌జిన్ డాట‌ర్ కూడా అక్క‌డ‌కు వీణ నేర్చుకునేందుకు వ‌చ్చేవార‌ట‌. ఓ రోజు ఆ పాపను తీసుకువెళ్లేందుకు వ‌చ్చిన వేణుస్వామి వీణా శ్రీవాణిని చూసి ఆమెకు ప్ర‌పోజ్ చేయ‌డం.. తాను చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాల‌ని ఫిక్స్ అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌.

ఆ త‌ర్వాత ఇంట్లో వాళ్ల నుంచి కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైనా చివ‌ర‌కు వేణుస్వామి.. వీణా శ్రీవాణి పెళ్లి జ‌రిగింది. చివ‌ర‌కు ఈ ప్రేమ వివాహం వ‌ల్ల త‌న అమ్మ వైపు వాళ్ల‌ను వ‌దులు కోవాల్సి వ‌చ్చింద‌ని అయితే ఆ బాధ‌ను త‌న భ‌ర్త రీ ప్లేస్ చేశార‌ని శ్రీ వాణి చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news