MoviesVithika హీరోయిన్‌గా మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తోన్న వ‌రుణ్ సందేశ్ భార్య...

Vithika హీరోయిన్‌గా మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తోన్న వ‌రుణ్ సందేశ్ భార్య వితిక‌… అందాల‌న్నీ ఆర‌బేసేస్తోందిగా…!

టాలీవుడ్ హీరో వ‌రుణ్ సందేశ్ భార్య వితికా షెరు మ‌నంద‌రికి బాగా తెలిసిన అమ్మాయే. గ‌తంలో ఎన్నో సినిమాల్లో న‌టించిన ఈ అమ్మాయి వ‌రుణ్‌తో క‌లిసి ఓ సినిమా చేసింది. ఆ టైంలోనే వీరు ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. వితిక స్వ‌స్థ‌లం ఏపీలోని భీమ‌వ‌రం. ఇక ఈ జంట బిగ్‌బాస్ హౌస్‌లోకి జంట‌గా ఎంట‌ర్ అయ్యి మ‌రింత పాపుల‌ర్ అయ్యారు.

బిగ్‌బాస్ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక వితిక చేసే సంద‌డి అయితే మామూలుగా ఉండ‌డం లేదు. అయితే ఇటీవ‌ల కాలంలో వితిక హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో మామూలుగా రెచ్చిపోవ‌డం లేదు. న‌డుము ఒంపులు చూపిస్తూ మ‌తులు పోగొడుతోంది. త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా, ఫొటో షూట్ల ద్వారా కావాల్సినంత అందాల విందు చేస్తోంది.

తాజా ఫొటో షూట్‌లో అందాలు ఆర‌బోస్తూ క‌వ్విస్తోంది. అస‌లు ఈ అందాల షూట్స్ చూస్తుంటే వితికాకు మ‌ళ్లీ హీరోయిన్ అవ్వాల‌న్న కోరిక బ‌లంగా ఉందే అనిపించేలా ఉంది. పెళ్లి అయిన హీరోయిన్లు ఎంత‌మంది ఇప్పుడు స‌క్సెస్ ఫుల్‌గా కెరీర్ కంటిన్యూ చేయ‌డం లేదు. న‌య‌న‌తార‌, కాజ‌ల్, స‌మంత లాంటి వాళ్లు పెళ్లి త‌ర్వాత కూడా ఛాన్సులు అందిపుచ్చుకునే విష‌యంలో కానీ, అందాలు ఆర‌బోసే విష‌యంలో కానీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

ఇప్పుడు వితికా కూడా గ‌ట్టిగా ట్రై చేస్తే ఛాన్సులు రావ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. అయితే హీరోయిన్ ఛాన్సులు అంటే మ‌రింత క‌ష్ట‌ప‌డాలి. ఫిజిక్ బాగా మెయింటైన్ చేస్తూ స‌న్న‌గా, నాజూగ్గా మారిపోవాల్సి ఉంది. అదే ఇత‌ర క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అంటే సింపుల్‌గానే అవ‌కాశాలు వ‌స్తాయి. ఓ వైపు వ‌రుణ్ హీరోగా నిల‌దొక్కుకునే విష‌యంలో ఇప్ప‌టీకి అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నాడు. మ‌రి ఈ టైంలో వితిక రీ ఎంట్రీ ఇస్తే ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news