Movies"నేను జబర్ధస్త్ మానేయడానికి కారణం ఆ ఇద్దరే".. బిగ్ బాంబ్ పేల్చిన...

“నేను జబర్ధస్త్ మానేయడానికి కారణం ఆ ఇద్దరే”.. బిగ్ బాంబ్ పేల్చిన అనసూయ ..!!

జబర్దస్త్ యాంకర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఆ క్రేజ్ తో సినిమా అవకాశాలు దక్కించుకుని ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయింది . న్యూస్ రీడర్గా తన కెరియర్ ని ప్రారంభించిన అనసూయ.. ప్రజెంట్ సినిమాలో కీలకపాత్రల్లో నటించే అంత స్థాయికి ఎదిగింది అంటే దాని వెనకాల .. ఆమె పడిన కష్టం.. ఆమెకున్న టాలెంట్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు .

కాగా రీసెంట్గా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను వదిలేసింది అనసూయ . ఈ క్రమంలోనే అనసూయ జబర్దస్త్ ని విడడానికి కారణం ఏంటా..? అంటూ సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటూ ఉండగా.. ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది అనసూయ . ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను జబర్దస్త్ నుండి బయటకు రావడానికి కారణం ఇద్దరే ఇద్దరు వ్యక్తులు కారణమంటూ చెప్పుకొచ్చింది.

“వాళ్ళు ఎవరో కాదు నా పిల్లలు.. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతున్నారు.. మంచి చెడు ఏదో తెలుసుకుంటున్నారు.. జబర్దస్త్ లో నా పై వేసే అడల్ట్ పంచెస్ కి వాళ్లకు నేను అర్థం చెప్పలేను . రేపటి రోజు వారు నన్ను ప్రశ్నించకూడదు . మా అమ్మపై ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడారా..? అని వాళ్ళు బాధపడకూడదు.. అందుకే ఆ కారణంగానే జబర్దస్త్ లో వల్గారిటీ పంచెస్ ఎక్కువైపోయిన కారణంగా నా బిడ్డలు వాటిని చూసి బాధపడకూడదు అన్న రీజన్ తో నేను బయటకు వచ్చేసాను “అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి జబర్దస్త్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news