Movies"నేను తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం అదే"..ప్రేమిస్తే భరత్ షాకింగ్ కామెంట్స్..!!

“నేను తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం అదే”..ప్రేమిస్తే భరత్ షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో..ఎవరు చెప్పలేరు . అలా ఎంతోమంది స్టార్స్ ఈ సినిమా మాయలకు బలైపోయారు . కాగా వాళ్ళల్లో ఒకరే భరత్. ఇలా చెప్పితే జనాలకు పెద్దగా గుర్తు రాదు .. ప్రేమిస్తే సినిమాలో ప్రేమించిన అమ్మాయి కోసం పిచ్చోడైపోయిన భరత్ అంటే మాత్రం టక్కున గుర్తుచేస్తుంది ..కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తుంది. అంతలా ప్రేమిస్తే సినిమాతో రియాలిటీని బయటపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు భరత్ . అప్పటి నుంచి ప్రేమిస్తే భరత్ గా గుర్తింపు సంపాదించుకున్న భరత్ తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చాడు .

శంకర్ దర్శకత్వం చేసిన బాయ్స్ చిత్రంలో పాపులర్ అయిన ఈ హీరో.. తెలుగులో యువసేన, మహేష్ బాబు స్పైడర్ సినిమాలలో కనిపించాడు . అయితే ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించకపోవడంతో అందరూ ఇతడు సినిమాలు ఆపేశారు అని అనుకున్నారు . అయితే రీసెంట్ గాసుధీర్ బాబు హీరోగా రూపొందించిన “హంట్” చిత్రంలో కీలక పాత్ర పోషించారు . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన తెలుగు కెరియర్ పై సంచలన కామెంట్స్ చేశాడు ప్రేమిస్తే భరత్.

ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ..”బాయ్స్, ప్రేమిస్తే, యువసేన వంటి చిత్రాలలో తెలుగు మార్కెట్ ఏర్పడిన కానీ ఎందుకు మీరు తెలుగు సినిమాలు చేయలేదు అంటూ మీడియా ప్రశ్నించగా.. తెలుగులో నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . కానీ తెలుగులో మంచి మంచి కథలు రాకపోవడంతో ..అదే టైంలో తమిళం మలయాళం లో మంచి స్టోరీస్ పడడంతో అక్కడ బిజీ అయిపోయాను. అంతే తప్పిస్తే తెలుగులో సినిమాలు చేయకూడదనే.. ఆలోచన నాకు లేదు ..ఇలాంటి మంచి మంచి ఆఫర్లు వస్తే కచ్చితంగా చేస్తాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . అంతేకాదు అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోయే అంత ఇష్టమని చెప్పుకొచ్చిన ఆయన తెలుగులో రాజమౌళి , సుకుమార్, త్రివిక్రమ్ వంటి దర్శకత్వంలో పని చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news