Moviesసోగ్గాడు శోభ‌న్‌బాబుకు జ‌య‌ల‌లిత‌తో పాటు ఆ హీరోయిన్‌తో కూడా ఎఫైర్‌..?

సోగ్గాడు శోభ‌న్‌బాబుకు జ‌య‌ల‌లిత‌తో పాటు ఆ హీరోయిన్‌తో కూడా ఎఫైర్‌..?

ఇప్పుడు ప్ర‌తి హీరోకు ఒక ప్ర‌త్యేక ఉన్న‌ట్టే.. గ‌తంలోనూ ప్ర‌తి హీరోకూ ప్ర‌త్యేకత ఇప్ప‌టిక‌న్నా ఎక్కువ‌గా ఉండేది. దానిని నిలబెట్టుకునేందుకు వారు ఎంతో శ్ర‌మించేవారు. ఇలాంటివారిలో సోగ్గాడు శోభ‌న్‌బాబు ముందు వ‌రుస‌లో ఉండేవారు. ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అని నమ్మే శోభ‌న్‌బాబు.. చాలా కండిష‌న్డ్ లైఫ్‌ను లీడ్ చేశార‌ని అంటారు. తెలుగు తెర‌పై అప్ప‌టికే అక్కినేని, ఎన్టీఆర్ వంటి హీరోలు ఉన్న‌ప్ప‌టికీ.. శోభ‌న్‌బాబు లీడ్ చేసిన సినీ లైఫ్ చాలా డిఫరెంట్.

ఎంతో అందంగా ఉండేవారు. అందుకే ఆయ‌న‌కు ఆంధ్రుల సోగ్గాడుగా పేరుండేది. దీని కోసం ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌లే తీసుకున్నారు. ఎలాంటి అల‌వాట్ల జోలికీ పోలేదు. లేట్ నైట్ పార్టీల‌కూ దూరం. ఎప్పుడై నా.. సిగ‌రెట్ అంతే! స్నేహితులతో క‌లిసి.. ఇత‌ర‌త్రా.. వ్యాప‌కాలు కూడా పెట్టుకోలేదు. షూటింగ్ అయిపో గానే ఇల్లు! అంతే.. ఈ క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఈ జాగ్ర‌త్త‌లే ఆయ‌ను హుందాగా నిలబెట్టాయి.

సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకునేలా చేశాయి.ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు హీరోయిన్ల‌తో ప‌రిచ యాలు కూడా ఎక్కువే అనే టాక్ పెద్ద ఎత్తున వినిపించేది. జ‌య‌ల‌లిత‌తో ఉన్న సంబంధం.. గురించి ఇప్ప‌టికీ ఒక మిస్ట‌రీనే న‌డుస్తోంది. దీనిపై ఎవ‌రి ఊహాగానాలు వారివి. ఆవిడ వ‌ద్దంటేనే సినిమాలు మానేశారని, ఆమెకు అందుబాటులో ఉండేందుకే.. చెన్నైలోనే ఉండిపోయార‌ని పెద్ద ఎత్తున క‌థ‌నాలు న‌డిచాయి.

మ‌రోవైపు.. ఇంకో సీనియ‌ర్ న‌టితోనూ శోభ‌న్‌బాబుకు రిలేష‌న్ ఉంద‌నే చ‌ర్చ ఇప్ప‌టికీ ఉంది. శోభ‌న్‌బాబు మృతి చెందిన‌ప్పుడు ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరును కూడా అప్ప‌ట్లో మీడియా ప్ర‌ధానంగా చూపించింది. అదేవిధంగా ఇంకో హీరోయిన్ కూడా శోభ‌న్‌బాబు అంటే.. ప్రాణం ఇచ్చేద‌ని.. అప్ప‌టి సిని క్రిటిక్స్ చెప్పేవా రు. మొత్తానికి సోగ్గాడు-హీరోయిన్లు టాపిక్‌.. ఆయ‌నలా.. అత్యంత గోప్యంగా ఉండేవి.. ఉన్నాయి కూడా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news