Moviesవావ్: జాక్ పాట్ కొట్టిన మృణాల్.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా..!!

వావ్: జాక్ పాట్ కొట్టిన మృణాల్.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మృణాల్ ఠాకూర్ . హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సీతారాం సినిమా ద్వారా తెలుగు జనాలకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇంకా పక్కాగా చెప్పాలంటే సినిమాలో నేషనల్ క్రష్ లాంటి రష్మిక మందన హీరోయిన్గా నటించిన అందరికళ్లు మృణాల్ ఠాకూర్ పైనే పడ్డాయి అంటే అమ్మడు ఈ సినిమాలో ఎంత బాగా లీనమైపోయినటించిందో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాదు మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో చూపించిన పర్ఫామెన్స్ కి బాలీవుడ్ – టాలీవుడ్ జనాలు కూడా ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా బడాబడా అవకాశాలతో ముందుకు దూసుకుపోతున్న మృణాల్ రీసెంట్గా తెలుగులో నాని సినిమాలో హీరోయిన్గా ఆఫర్ అందుకుంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ తెలుగు లో మరో మెగా హీరోతో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది .

వరుణ్ తేజ్ తర్వాత రాబోతున్న సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం మృణాల్ ఠాకూర్ కెరియర్ దశతిరిగిపోయింది అని చెప్పాలి. మెగా హీరోతో సినిమా అంటే మాటలు కాదు . అది కూడా వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోతో ఆఫర్ దక్కించుకుందంటే రేపు రామ్ చరణ్ – ఎన్టీఆర్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంటుంది అంటూ ఆమె ఫ్యాన్స్ సంబరపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news