Moviesఅది జ‌ర‌గ‌క‌పోతే వీర‌సింహాను త‌ట్టుకోవ‌డం వీర‌య్య‌కు క‌ష్ట‌మేనా...!

అది జ‌ర‌గ‌క‌పోతే వీర‌సింహాను త‌ట్టుకోవ‌డం వీర‌య్య‌కు క‌ష్ట‌మేనా…!

బాల‌య్య‌, చిరు సినిమాలు విడివిడిగా వ‌స్తే ఏమోగాని ఒకేసారి వ‌స్తే ఆ పోటీ.. ఆ వేడీ ఎలా ? ఉంటుందో చాలా యేళ్లుగా చూస్తున్నాం.. అందులోనూ సంక్రాంతికి ఇద్ద‌రు హీరోల సినిమాలు వ‌స్తే అస‌లు తెలుగు గ‌డ్డ‌పై పెద్ద పోరాటం జ‌రుగుతున్న‌ట్టుగానే ఉండేది. ఆరేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఇద్ద‌రు హీరోలు న‌టించిన రెండు సినిమాలు సంక్రాంతి బ‌రిలో దిగుతున్నాయి. ఇప్ప‌టికే వీర‌సింహారెడ్డి ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది.

ఇక రేపు చిరు వాల్తేరు వీర‌య్య కూడా రిలీజ్ కానుంది. అయితే బాల‌య్య సినిమాకు వ‌చ్చినంత ప్రి రిలీజ్ బ‌జ్ చిరు సినిమాకు ఉన్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు. ఇక్క‌డ చాలా కార‌ణాలు ఉన్నాయి. ఒక‌ప్పుడు చిరు సినిమా వ‌స్తుందంటే చాలు మెగా హీరోలు, మెగాభిమానులు అంతా ఒక్క‌టై నానా హ‌డావిడి, హంగామా చేసేవారు. ఇప్పుడు అది క‌న‌ప‌డ‌డం లేదు. సైరా, ఆచార్య మాత్ర‌మే కాదు.. హిట్ టాక్ వ‌చ్చిన గాడ్ ఫాథ‌ర్ విష‌యంలోనూ మెగాభిమానులు ప‌ట్టించుకోలేదు.

ఇప్పుడు మెగాభిమానుల్లో చీలిక స్ప‌ష్టంగా ఉంది. బ‌న్నీ, ప‌వ‌న్ అభిమానులు వేరుగా ఉంటున్నారు. దీనికి తోడు బాల‌య్య సోష‌ల్ మీడియా, మీడియాను పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా ఆయ‌న‌కు తెలుగుదేశం అభిమానుల స‌పోర్ట్‌, ఇటు నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానుల స‌పోర్ట్ కూడా ఉంది. ఎన్టీఆర్‌, బాల‌య్య అభిమానులు వేర్వేరు అన్న బ‌య‌ట ప్ర‌చారం ఉన్నా వాస్త‌వంగా వాళ్లంతా ఒక్క‌టే అని టైం వ‌చ్చిన‌ప్పుడు చూపిస్తారు.

పైగా బాల‌య్య‌కు సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల కాలంలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. అఖండ‌తో పాటు అన్‌స్టాప‌బుల్‌తో ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు, యూత్‌కు, బుల్లితెర ఫ్యాన్స్‌కు బాగా క‌నెక్ట్ అయిపోయాడు. ఇక వీర‌సింహాకు ఇండ‌స్ట్రీలో ఓ సెక్ష‌న్ జ‌నాల‌తో పాటు నిర్మాత‌లు, అటు ఓవ‌ర్సీస్‌లో రాజ‌కీయ నాయ‌కులు, ఎన్నారైలు కూడా భారీ ఎత్తున టిక్కెట్లు బ‌ల్క్‌గా బుక్ చేయ‌డం.. ఏకంగా షోల‌కు షోలే కొనేయ‌డం జ‌రిగాయి.

ఈ విష‌యంలో వీర‌య్య కాస్త వెన‌కాలే ఉంది. ఎక్క‌డో ఎందుకు తెలంగాణ‌లోనూ బాల‌య్య మార్కెట్ బాగా పెరిగింది. హైద‌రాబాద్‌లో ఈ రోజు అన్ని థియేట‌ర్ల‌లో సినిమా వేసినా.. అన్నీ షోలు హౌస్ ఫుల్స్ అయిపోయాయి. అస‌లు టిక్కెట్లు దొరికే ప‌రిస్థితి లేదు. హైద‌రాబాద్‌లో వీర‌సింహా జోరును వీర‌య్య త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్టంగానే ఉంది. సీడెడ్‌లోనూ అదే ప‌రిస్థితి. అయితే ఆంధ్రాలో వీర‌య్య ప‌రిస్థితి కాస్త బెట‌ర్‌.

బాల‌య్య సినిమాల‌కు రాజ‌కీయ హ‌డావిడి బాగా ఎక్కువ‌. చిరు సినిమాకు అది లేక‌పోవ‌డం మైన‌స్సే. మెగాభిమానులు చిరు, బ‌న్నీ, ప‌వ‌న్ ఫ్యాన్స్‌గా విడిపోయారు. అటు నంద‌మూరి అభిమానులు విడిపోవాల‌న్నా తెలుగుదేశం పార్టీ వారిని ఒక్క‌టిగా చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు చిరు ఫ్యాన్స్ అంతా ఫిఫ్టీ ప్లస్‌లోకి వెళ్లారు. వీరు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఏదేమైనా ఇప్పుడు వీర‌సింహా జోరు ముందు వీర‌య్య నిల‌బ‌డాలంటే యునాన‌మ‌స్‌గా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకోవాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news