Movies"అనుకున్నింది ఒక్కటి..జరిగింది మరోకటి"..హనీ రోజ్ ఎంట్రా బాబు ఇలా అనేసింది..!!

“అనుకున్నింది ఒక్కటి..జరిగింది మరోకటి”..హనీ రోజ్ ఎంట్రా బాబు ఇలా అనేసింది..!!

హనీ రోజ్ నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోయారు . కానీ వీర సింహారెడ్డి సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది అని తెలియగానే ఆమె పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోయింది. మరీ ముఖ్యంగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హనీ రోజ్ అందరికన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి అందరి కళ్ళు ఆమెపై పడేలా చేసుకుంది. కాగా రీసెంట్గా అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చిన హాని రోజ్ .. బాలయ్య తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ అయిన శుభ సందర్భంగా ..అన్ స్టాపబుల్ టాక్ షోలో స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు ఆహా. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్గా రిలీజ్ అయింది . ఈ ప్రోమోలో బాలయ్య హనీరోజ్ తో మాట్లాడుతూ ..”ఈ సినిమాలో నువ్వు నాతో నటిస్తున్నావు అని తెలియగానే ..నా గురించి ఏమన్నా కనుక్కున్నావా?.. సెర్చ్ చేసావా..?” అని అడుగుతారు బాలయ్య. దీంతో హనీ రోజ్ ఇచ్చిన ఆన్సర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

” నేను అఖండ సినిమాను ఎన్నోసార్లు చూశాను . మీ గురించి ఎన్నో విన్నాను..చూశాను.. ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం తలకిందులు చేసేసారు మీరు. మిమ్మల్ని అంచనా వేయలేం ..మీరు రియల్ హీరో ” అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది. అప్ కోర్స్.. అందరూ బాలయ్య అంటే కోపం గంభీరం అనుకుంటారు ..దాని వెనుక ఉన్న చిలిపి బాలని ..సరదా బాలయ్య ని చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారు . వాళ్లలో ఒకరే ఈ హనీ రోజ్ అని చెప్పక తప్పదు . ఏది ఏమైనా సరే హనీ రోజ్ ..బాలయ్య ని ఓ రేంజ్ లో పొగిడిస్తూ ఉంటే నందమూరి అభిమానులు భలే ఎంజాయ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news