Moviesవీరసింహారెడ్డి స్పెషల్: సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ అదే.. గోపీ కావాలనే అలా...

వీరసింహారెడ్డి స్పెషల్: సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ అదే.. గోపీ కావాలనే అలా డిజైన్ చేశాడా..?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య హీరోగా అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సినిమా వీరసింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . కాగా మొదటి షో పడగానే సినిమా సూపర్ డూపర్ హిట్టు టాక్ బయటకు వచ్చేసింది . అంతేకాదు అన్ని ఎమోషన్స్ అన్ని రంగులు కలగల్సిన సినిమాగా వీరసింహారెడ్డి టాక్ దక్కించుకుంది.

ఇప్పటివరకు బాలయ్య సినిమాలను మనం చూసినట్లయితే ప్రతి సినిమాలోను మాస్ యాంగిల్ హైలెట్ చేస్తూ వచ్చారు. కానీ ఈ సినిమాల్లో మాస్ యాంగిల్ తో పాటు నందమూరి హీరోలోని లవర్ బాయ్ ని.. రొమాంటిక్ హీరోని డ్యాన్సర్ ని బయటకు తవ్వాడు గోపీచంద్ మలినేని . అయితే అన్ని బాగున్నా ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ మాత్రం బిస్కెట్ అయింది . అదే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ పాత్ర . ఎస్ మొదటి నుంచి సినిమాలో శృతిహాసన్ బాలయ్య కాంబో పై ఓ రేంజ్ లో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసారు జనాలు.

సింహ సినిమాలో నయనతార రేంజ్ లో అల్లాడిస్తుందని భావించారు. సిన్ కట్ చేస్తే అసలు వీరసింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ పాత్ర ఎందుకు పెట్టాడు డైరెక్టర్ అనేది.. పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది . కానీ సుగుణసుందరి సాంగ్లో మాత్రం స్టెప్స్ ఇరగదీసింది శృతి. మాస్ మొగుడు లో కూడా బాలయ్యతో సమానంగా ఆడి పాడి అలరించింది . అయితే బాలయ్య రేంజ్ పెంచడానికి శృతిహాసన్ క్యారెక్టర్ అలా గోపీచంద్ చేశాడా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి . ఏది ఏమైనా సరే శృతిహాసన్ పాత్ర ఈ సినిమాలో బిస్కెట్ అయినా సినిమాకి కర్త – కర్మ – క్రియ అన్ని తానై పోషించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఈ సినిమా చూస్తున్నంత సేపు జై బాలయ్య అంటూ అరుపులతో కేకలతో నినాదాలతో థియేటర్స్ మారుమ్రోగిపోతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news