Moviesనాగార్జున ముందే ఏడుస్తూ ఆ విషయాని బయటపెట్టిన అవికా..తెలుగు ఇండస్ట్రీ పై...

నాగార్జున ముందే ఏడుస్తూ ఆ విషయాని బయటపెట్టిన అవికా..తెలుగు ఇండస్ట్రీ పై సెన్సేషనల్ కామెంట్స్..!!

అవికా గోర్ .. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు . చిన్నారి పెళ్ళికూతురు అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన మొదటి సీరియల్ తో విపరీతమైన క్రేజ్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ అవికా గోర్. బాలీవుడ్లో టెలికాస్ట్ అయినా బాలిక వధు అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అవికాగోర్ ఈ సీరియల్ ద్వారా ఎలాంటి పాపులారిటీ క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

కాగా ఈ సీరియల్ తో వచ్చిన పాపులారిటీతో సినిమాలో రాణించాలని ట్రై చేసింది అవికా. తెలుగులో పరిశ్రమల్లో కూడా నటించి మెప్పించింది. అయితే అనుకున్న విధంగా పెద్ద స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది . కాగా కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని అవికా హీరోయిన్గా ట్రై చేస్తుంది . రీసెంట్గా అవికాగోర్ హీరోయిన్గా నటించిన సినిమా పాప్‌ కార్న్. సాయిరోనక్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి మురళిగందం దర్శకత్వం వహించారు. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నాగార్జున గ్రాండ్ గా లాంఛ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర బృందానికి విషెస్ చెప్తూనే అవికా గోర్.. పొగిడేసారు . “పదేళ్ల క్రితం తాను బ్రెజిల్ లో రియో నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడియోలో అవిక ఫోటో కనిపించిందని ..అప్పుడే ఆమె ఇండస్ట్రిలో మంచి హీరోయిన్ అవుతుందని అనుకున్నానని చెప్పుకొచ్చాడు . అది చిన్నారి పెళ్లికూతురు సీరియల్ పోస్టర్ అని.. అక్కడ కూడా సీరియల్ ని డబ్ చేసి అవికాని ఆదరిస్తున్నారని తెలిసింది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ దాదాపు 128 దేశాల్లో డబ్ చేసి టెలికాస్ట్ చేశారని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్లో అవికా మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది. ” తనకి తెలుగు ఇండస్ట్రీ ఎన్నో ఇచ్చిందని.. తను తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు రుణపడి ఉంటానని ..నాగార్జున ముందే ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది “. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news